ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team India: సంజు శాంసన్‌ను తొక్కేస్తున్నారా? సెలక్టర్లు కన్నింగ్ ప్లాన్ వేశారా?

ABN, First Publish Date - 2023-12-01T17:54:45+05:30

Team India For South Aftica Tour: ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ సారథిగా అద్భుతంగా రాణిస్తున్న సంజు శాంసన్‌కు టీమిండియా సెలక్టర్లు హ్యాండ్ ఇస్తూనే ఉన్నారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌కు, ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌కు శాంసన్ లాంటి ఆటగాడిని దూరం పెట్టడం చాలా మంది క్రికెట్ అభిమానులకు నచ్చలేదు.

టీమిండియాలో యువ ఆటగాళ్ల ప్రభంజనం క్రమంగా పెరుగుతోంది. ఐపీఎల్ కారణంగా జాతీయ జట్టులో ఎవరికి ఎప్పుడు స్థానం లభిస్తుందో చెప్పలేని పరిస్థితి. అయితే కొందరు ప్రతిభావంతులకు అవకాశాలు దక్కుతుండగా మరికొందరికి మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది. అలాంటి జాబితాలో సంజు శాంసన్ తప్పకుండా ఉంటాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ సారథిగా అద్భుతంగా రాణిస్తున్న సంజు శాంసన్‌కు టీమిండియా సెలక్టర్లు హ్యాండ్ ఇస్తూనే ఉన్నారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌కు, ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌కు శాంసన్ లాంటి ఆటగాడిని దూరం పెట్టడం చాలా మంది క్రికెట్ అభిమానులకు నచ్చలేదు. ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక చేసిన టీమిండియాలో శాంసన్‌ను సెలక్టర్లు ఎట్టకేలకు కరుణించారు. మూడు వన్డేల సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ అభిమానులను కలవరపరుస్తోంది.

సఫారీ గడ్డపై పర్యటనకు సంజు శాంసన్‌ను వన్డేలకు ఎంపిక చేసిన సెలక్టర్లు టీ20లకు పక్కన పెట్టడంతో సెలక్టర్ల తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో శాంసన్‌ను సెలక్టర్లు విస్మరించిన సమయంలో వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక చేస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా వన్డే ప్రపంచకప్‌కు కూడా శాంసన్‌కు హ్యాండిచ్చారు. జట్టులో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు ఉండటంతో శాంసన్‌ను పరిగణనలోకి తీసుకోలేదని.. అతడు 2024 టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో ఉన్నాడని సెలక్టర్లు సమాధానం ఇచ్చారు. కట్ చేస్తే.. ఇప్పుడు టీ20లకు ఎంపిక చేయకుండా వన్డేలకు ఎంపిక చేయడంతో సెలక్టర్లు కన్నింగ్ ప్లాన్ వేశారని.. శాంసన్‌ను కావాలనే తొక్కేస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. టీ20 ఫార్మాట్‌లో శ్రేయాస్ అయ్యర్ కంటే సంజు శాంసన్ నాణ్యమైన ఆటగాడు అని.. ఇప్పటికైనా సెలక్టర్లు కళ్లు తెరవాలని ఆకాంక్షిస్తున్నారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-01T17:54:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising