ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

SA Vs IND: రేపటి నుంచి వన్డే సిరీస్.. ఓపెనర్‌గా సంజు శాంసన్..?

ABN, Publish Date - Dec 16 , 2023 | 06:51 PM

SA Vs IND: దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను సమం చేసిన టీమిండియా ఆదివారం నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి వన్డేలో పలు ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య లాంటి ఆటగాళ్లు లేకపోవడంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో టీమిండియా కొత్తగా కనిపించనుంది.

దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్‌ను సమం చేసిన టీమిండియా ఆదివారం నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి వన్డేలో పలు ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య లాంటి ఆటగాళ్లు లేకపోవడంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో టీమిండియా కొత్తగా కనిపించనుంది. సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో కొత్తవాళ్లు జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. రింకూ సింగ్ వన్డేల్లో అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్‌కు తోడుగా సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా పంపించే అవకాశాలు ఉన్నాయి. కెప్టెన్ కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో ఆడనుండటమే దీనికి కారణమని తెలుస్తోంది.

ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్.. వన్‌డౌన్‌లో తిలక్ వర్మ, నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్, ఐదో స్థానంలో కేఎల్ రాహుల్, ఆరో స్థానంలో రింకూ సింగ్, ఏడో స్థానంలో అక్షర్ పటేల్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్‌దీప్ యాదవ్.. పేసర్లుగా ముఖేష్ యాదవ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్ ఆడనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ తిలక్ వర్మను కాదనుకుంటే సాయి సుదర్శన్‌కు చోటు దక్కే అవకాశం లేకపోలేదు. మరి కెప్టెన్ కేఎల్ రాహుల్ తుది జట్టును ఎలా ఎంపిక చేస్తాడో చూడాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే. తొలి వన్డే భారత కాలమానం ప్రకారం జోహన్నెస్ బర్గ్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 16 , 2023 | 06:51 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising