ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Womens Premier League: బెంగళూరును ఉతికి ఆరేస్తున్న ఢిల్లీ బ్యాటర్లు.. రెండో మ్యాచ్‌లోనే రికార్డు

ABN, First Publish Date - 2023-03-05T16:40:15+05:30

మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్‌(WPL)లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ (DC)బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం ఎంత తప్పో ఢిల్లీ ఓపెనర్ల ఊపు చూసి కానీ బెంగళూరుకు అర్థం కాలేదు. ఓపెనర్లు మెగ్ లానింగ్, షెఫాలీ వర్మ ఆర్సీబీ బౌలర్లను ఆడుకుంటున్నారు. ఢిల్లీ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతుండడంతో లానింగ్, షెఫాలీ పోటీ పడి పరుగులు సాధిస్తున్నారు.

వీరి దెబ్బకు స్కోరు అలుపు లేకుండా పరుగులు తీస్తోంది. అంతేకాదు, డబ్ల్యూపీఎల్‌లో తొలి సెంచరీ భాగస్వామ్యం నమోదైంది. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత ఇద్దరూ మరింతగా చెలరేగుతున్నారు. షెఫాలీ వర్మ (Shafali Verma)సెంచరీకి చేరువైంది. మరోవైపు, వీరి భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు ఢిల్లీ బౌలర్లు చెమటోడుస్తున్నా ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిశాయి. ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 153 పరుగులు చేసింది. లానింగ్ 64, షెఫాలీ వర్మ 84 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Updated Date - 2023-03-05T16:47:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising