ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team India: ప్రాక్టీస్ మ్యాచ్‌లో అదుర్స్.. శ్రేయాస్ అయ్యర్ భారీ సెంచరీ

ABN, First Publish Date - 2023-08-24T19:22:02+05:30

ఆసియా కప్‌కు ఎంపికైన శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గానే ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ప్రతిష్టాత్మక టోర్నీకి ముందు బెంగళూరులో బీసీసీఐ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఐదు రోజుల పాటు జరిగే ఈ క్యాంప్‌లో ప్రాక్టీస్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శ్రేయాస్ అయ్యర్ సత్తా చాటాడు. 38 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన అతడు 199 పరుగులు చేశాడు. అంతేకాకుండా 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్‌లో పాల్గొన్నాడు.

సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా కప్‌కు ఎంపికైన శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గానే ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ప్రతిష్టాత్మక టోర్నీ ముందు ఒక్క మ్యాచ్ కూడా ఆడని శ్రేయాస్‌ను ఎలా ఎంపిక చేస్తారంటూ పలువురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌కు ఎంపికైన ఆటగాళ్లు ఫిట్‌నెస్ నిరూపించుకోవాలని సెలక్టర్లు సూచించారు. దీంతో బెంగళూరులో బీసీసీఐ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఏర్పాటు చేసింది. ఐదు రోజుల పాటు జరిగే క్యాంప్‌లో ప్రాక్టీస్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు శ్రేయాస్ అయ్యర్ సత్తా చాటాడు. 38 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన అతడు 199 పరుగులు చేశాడు. అంతేకాకుండా 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్‌లో పాల్గొన్నాడు.

కాగా ఆసియా కప్‌లో టీమిండియా విజేతగా నిలవాలంటే మిడిలార్డర్ నిలకడగా రాణించాల్సి ఉంది. ఇటీవల వెస్టిండీస్, ఐర్లాండ్‌తో జరిగిన టోర్నీలను పరిగణనలోకి తీసుకుంటే మిడిలార్డర్ బలహీనంగా కనిపించింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞులు లేని లోటు స్పష్టంగా కనిపించింది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ నిలకడగా రాణించకపోవడంతో మిడిలార్డర్ వైఫల్యంపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌కు బలమైన జట్టు అందుబాటులోకి వచ్చింది. కోహ్లీ, రాహుల్, జడేజా, పాండ్యాలతో పాటు శ్రేయాస్ అయ్యర్ కూడా ఆసియా కప్ ఆడనున్నాడు. ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో సిరీస్ తర్వాత గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న అతడు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఇప్పుడు ఫిట్‌నెస్ నిరూపించుకుని ఆసియా కప్ టోర్నీకి సమాయత్తం అయ్యాడు.

ఇది కూడా చదవండి: World Cup Chess Final: టై బ్రేకర్‌లో పోరాడి ఓడిన ప్రజ్ఞానంద.. మాగ్నస్ విజయం

వన్డేల విషయానికి వస్తే.. 2017 నుంచి 2021 వరకు శ్రేయాస్ అయ్యర్ 22 మ్యాచ్‌లు ఆడి 813 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2022-23లో 20 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్ 818 పరుగులు చేశాడు. యావరేజ్ 51.12గా నమోదైంది. ఇందులో ఒక సెంచరీ, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాగా మహారాష్ట్రకు చెందిన శ్రేయాస్ అయ్యర్ పూర్తి పేరు శ్రేయాస్ సంతోష్ అయ్యర్. అతడు రైట్ హ్యాండ్ బ్యాటర్. మిడిలార్డర్‌లో నిలకడగా రాణించే టాలెంట్ ఉంది. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అయితే ఈ ఏడాది గాయం కారణంగా ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు.

Updated Date - 2023-08-24T19:22:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising