India vs Sri Lanka: గిల్ సెంచరీ.. కోహ్లీ అర్ధ సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్
ABN, First Publish Date - 2023-01-15T15:56:41+05:30
శ్రీలంక(Sri Lanka)తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో భారత్ (Team India) చెలరేగుతోంది. తొలి రెండు వన్డేల్లో విజయం సాధించి
తిరువనంతపురం: శ్రీలంక(Sri Lanka)తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో భారత్ (Team India) చెలరేగుతోంది. తొలి రెండు వన్డేల్లో విజయం సాధించి ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకున్న రోహిత్ సేన మూడో వన్డేలోనూ అదే దూకుడు కొనసాగిస్తోంది. మైదానంలో పరుగుల వాన కురిపిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు మంచి భాగస్వామ్యం లభించింది.
కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్(Shubman Gill) సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు పేర్చుకుంటూ పోయారు. ఈ క్రమంలో 49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసిన రోహిత్(Rohit Sharma)ను కరుణరత్నె అవుట్ చేశాడు. దీంతో 95 పరుగుల తొలి వికెట్ భాగస్వామానికి తెరపడింది. అనంతరం వచ్చిన కోహ్లీ(Virat Kohli)తో కలిసి శుభమన్ గిల్ చెలరేగిపోయాడు. ఇద్దరూ కలిసి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో కోహ్లీ 48 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాతి బంతికే శుభమన్ గిల్ శతకం నమోదు చేశాడు. 89 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్‌కు వన్డేల్లో ఇది రెండో సెంచరీ. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించేందుకు ప్రయత్నించిన గిల్ రజిత బౌలింగులో బౌల్డయ్యాడు. మొత్తంగా 97 బంతులు ఎదుర్కొన్న గిల్ 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 116 పరుగులు చేశాడు. ప్రస్తుతం 34 ఓవర్లు ముగిశాయి. భారత జట్టు రెండు వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. కోహ్లీ 59, శ్రేయాస్ అయ్యర్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.
Updated Date - 2023-01-15T16:04:37+05:30 IST