India vs Sri Lanka: శ్రీలంకను దెబ్బకొట్టిన సిరాజ్
ABN, First Publish Date - 2023-01-10T18:33:06+05:30
భారత్ నిర్దేశించిన 374 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకను టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే దెబ్బకొట్టాడు.
గువాహటి: భారత్ నిర్దేశించిన 374 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకను టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. 19 పరుగుల వద్ద అవిష్క ఫెర్నాండో (5)ను అవుట్ చేసిన సిరాజ్.. ఆ తర్వాతి ఓవర్‌లో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్‌ను డకౌట్ చేశాడు. దీంతో 23 పరుగులకే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిశాయి. శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. పాథుమ్ నిశ్శంక (22), చరిత్ అసలంక (10) క్రీజులో ఉన్నారు.
అంతకుముందు భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 373 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో 45 సెంచరీ సాధించాడు. 87 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్‌తో 113 పరుగులు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 83 పరుగులు చేసి సెంచరీ ముంగిట అవుటయ్యాడు. శుభమన్ గిల్ 70 పరుగులు చేశాడు.
Updated Date - 2023-01-10T18:33:08+05:30 IST