ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup: ప్రపంచకప్‌లో చెత్త రికార్డు.. గోల్డెన్ డకౌట్ అయిన నాలుగో జంట

ABN, First Publish Date - 2023-11-02T20:09:36+05:30

ప్రపంచకప్‌లో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక చెత్త రికార్డు సాధించింది. వన్డేల్లో ఓ ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్ అయిన 4వ జంటగా నిశాంక-కరుణరత్నే జోడీ నిలిచింది.

వన్డే ప్రపంచకప్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా టీమిండియా జోరుతో కనిపిస్తోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో విజయాలు సాధించిన రోహిత్ సేన గురువారం ముంబై వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లోనూ విజయం దిశగా సాగుతోంది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో ఓపెనర్లు నిశాంక, కరుణరత్నె ఇద్దరూ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టారు. ఈ క్రమంలో ఈ మ్యాచ్‌లో శ్రీలంక చెత్త రికార్డు సాధించింది.

వన్డేల్లో ఓ ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్ అయిన 4వ జంటగా నిశాంక-కరుణరత్నే జోడీ నిలిచింది. గతంలో జింబాబ్వే ఓపెనర్లు పీట్ రింకే-టెర్రీ డఫిన్ 2006లో వెస్టిండీస్‌పై గోల్డెన్ డకౌట్ అయ్యారు. అలాగే శ్రీలంక ఓపెనర్లు తిరుమన్నె-దిల్షాన్ 2015లో ఆప్ఘనిస్తాన్‌పై గోల్డెన్ డకౌట్ అయ్యారు. దీంతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గప్తి్ల్, కొలిన్ మున్రో 2019లో వెస్టిండీస్‌పై గోల్డెన్ డకౌట్ కావడంతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. తాజాగా టీమిండియాపై శ్రీలంక ఓపెనర్లు నిశాంక-కరుణరత్నె కూడా గోల్డెన్ డకౌట్ అయ్యారు. అంతకుముందు టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 358 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

Updated Date - 2023-11-02T20:15:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising