ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cricket: క్రికెట్‌లో రెడ్ కార్డ్ రూల్ అమలు.. పెవిలియన్ చేరిన తొలి క్రికెటర్ ఎవరంటే..?

ABN, First Publish Date - 2023-08-29T16:30:18+05:30

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నిర్వాహకులు రెడ్ కార్డ్ రూల్‌ను తొలిసారి అమలు చేశారు. ఈ రూల్ ప్రకారం వెస్టిండీస్ ఆటగాడు సునీల్ నరైన్ పెవిలియన్ బాట పట్టాడు.

ప్రస్తుతం క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో టీ20 క్రికెట్ అభిమానులకు ఎంతో మజా పంచుతోంది. కానీ టీ20 క్రికెట్‌లో స్లో ఓవర్‌ రేట్‌ క్రమంగా పెరుగుతోంది. దీన్ని కట్టడి చేసేందుకు కఠిన నిబంధనలు అమలు చేయాలని ప్రస్తుత సీజన్‌లో కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) నిర్వాహకులు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఫుట్‌బాల్‌ తరహాలో రెడ్‌ కార్డు రూల్‌ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో రెడ్ కార్డు నిబంధనను ప్రస్తుతం జరుగుతున్న సీపీఎల్‌లో అమలు చేయగా పెవిలియన్ చేరిన తొలి క్రికెటర్‌గా వెస్టిండీస్ ఆటగాడు సునీల్ నరైన్ నిలిచాడు.

కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నిర్వాహకులు రెడ్ కార్డ్ రూల్‌ను తొలిసారి అమలు చేశారు. అయితే ఫుట్‌బాల్ తరహాలో ఆటగాడి ప్రవర్తన ఆధారంగా రెడ్ కార్డు నిబంధనను అమలు చేయడం లేదు. నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తిచేయనందుకు ఈ రూల్ వర్తిస్తుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. రెడ్ కార్డ్ రూల్ ప్రకారం ఆఖరి ఓవర్‌ నిర్ణీత సమయానికి మొదలవకపోతే ఫీల్డింగ్‌ జట్టుకు రెడ్‌ కార్డ్‌ చూపిస్తారు. అప్పుడు ఓ ఆటగాడు మైదానం బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియాట్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇదే జరిగింది. దీంతో అంపైర్ ఒక ఆటగాడిని మైదానం నుంచి బయటకు పంపాలని ఫీల్డింగ్ జట్టు కెప్టెన్ కీరన్‌ పొలార్డ్‌కు సూచించాడు. అప్పటికే తన కోటా ఓవర్లు పూర్తి చేసుకున్న సునీల్‌ నరైన్‌ పేరును ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ పొలార్డ్‌ ప్రతిపాదించాడు. ఫలితంగా ఫీల్డ్‌ అంపైర్‌ నరైన్‌కు రెడ్‌ కార్డ్‌ చూపించాడు. దీంతో నైట్‌రైడర్స్‌ 10 మంది ఆటగాళ్లతోనే చివరి ఓవర్‌ కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సెయింట్‌ కిట్స్‌ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు 17.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది.

ఇది కూడా చదవండి: Team India: ఓపెనర్లు చెలరేగింది ఈరోజే.. రోహిత్-ధావన్ సూపర్ ఇన్నింగ్స్‌కు ఐదేళ్లు

మరోవైపు నిర్ణీత సమయానికి 18వ ఓవర్‌ ప్రారంభం కాకపోతే ఒక ఫీల్డర్‌ను, 19వ ఓవర్‌ కూడా ఆలస్యమైతే ఇద్దరు ఫీల్డర్లను ఇన్నర్‌ సర్కిల్‌లోకి తీసుకొచ్చే నిబంధన ఈపాటికే అమలులో ఉంది. ఇప్పుడు రెడ్‌కార్డ్‌ నిబంధనతో నిర్వాహకులు మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. ఒకవేళ బ్యాటర్లు సమయం వృథా చేస్తే దాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని అంపైర్లు రెండుసార్లు హెచ్చరిస్తారు. ఆ తర్వాత నుంచి వార్నింగ్‌ ఇచ్చిన ప్రతిసారి పెనాల్టీ కింద 5 పరుగుల కోత విధిస్తారు.

Updated Date - 2023-08-29T16:30:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising