కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Suryakumar Yadav: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ గెలిచి తీరుతాం

ABN, First Publish Date - 2023-11-25T19:00:50+05:30

Team india: ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీ ఫైనల్లో ఓడిపోయిన తమకు ప్రధాని మోదీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కూడా ఎంతో మద్దతుగా నిలిచారని.. వారి పట్ల ఎప్పటికీ కృతజ్ఞులుగా ఉంటామని పేర్కొన్నాడు. నిజానికి ప్రపంచకప్‌లో తమ ప్రదర్శన చాలా సంతృప్తి ఇచ్చిందని. .ఈ జోష్‌తో వచ్చే ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో గెలిచి తీరుతామని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.

Suryakumar Yadav: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ గెలిచి తీరుతాం

వన్డే ప్రపంచకప్ ఓటమి ఇంకా తమను వెంటాడుతూనే ఉందని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. అయితే ప్రపంచకప్ ఓటమి అనంతరం తీవ్ర నిరాశలో ఉన్న తమ వద్దకు ప్రధాని మోదీ రావడం చాలా పెద్ద విషయం అని అభిప్రాయపడ్డాడు. ఓటమి నుంచి బయటపడేందుకు సుమారు 5-6 నిమిషాల పాటు తమను మోదీ ఎంతో మోటివేట్ చేశారని సూర్యకుమార్ తెలిపాడు. దేశానికి నాయకుడిగా ఉన్న వ్యక్తి తమ డ్రస్సింగ్ రూంకు రావడం నిజంగా ఆశ్చర్యపరిచిందని.. ఈ అనుభూతి చాలా గొప్పగా అనిపించిందని సూర్య అన్నాడు. మరోవైపు ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీ ఫైనల్లో ఓడిపోయిన తమకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కూడా ఎంతో మద్దతుగా నిలిచారని.. వారి పట్ల ఎప్పటికీ కృతజ్ఞులుగా ఉంటామని పేర్కొన్నాడు. నిజానికి ప్రపంచకప్‌లో తమ ప్రదర్శన చాలా సంతృప్తి ఇచ్చిందని. .ఈ జోష్‌తో వచ్చే ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో గెలిచి తీరుతామని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.

కాగా ప్రస్తుతం టీమిండియా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతోంది. విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ చాలా ఉత్కంఠగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 3 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్ ధాటిగా ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇషాన్ కిషన్ కూడా తన సత్తా చూపించాడు. అయితే తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ రాణించలేకపోయారు. తిరువనంతపురం వేదికగా జరిగే రెండో టీ20లో వీళ్లు రాణించాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా దక్షిణాఫ్రికా పయనం కానుంది.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-25T19:00:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising