ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

World Cup Final: కంటతడి పెట్టుకున్న రోహిత్ శర్మ.. బ్యాటింగ్ నిరాశపరిచిందని వ్యాఖ్య

ABN, First Publish Date - 2023-11-19T22:47:00+05:30

ఎంతో ఆసక్తి రేపిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓటమి పాలవ్వడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. కంటతడి పెట్టుకున్న సన్నివేశాలు లైవ్‌లో కనిపించాయి. దీంతో ఈ వీడియో చూసి అతడి అభిమానులు ఫీలవుతున్నారు. ప్రతి మ్యాచ్‌లో పిచ్‌కు తగ్గట్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి శుభారంభాలు అందించినా రోహిత్‌కు కన్నీరే మిగలడం నిజంగా బాధాకరంగా ఉందని అతడి అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓటమి పాలవ్వడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యాడు. కంటతడి పెట్టుకున్న సన్నివేశాలు లైవ్‌లో కనిపించాయి. దీంతో ఈ వీడియో చూసి అతడి అభిమానులు ఫీలవుతున్నారు. ప్రతి మ్యాచ్‌లో పిచ్‌కు తగ్గట్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి శుభారంభాలు అందించినా రోహిత్‌కు కన్నీరే మిగలడం నిజంగా బాధాకరంగా ఉందని అతడి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. టీమిండియాకు విధి కూడా అనుకూలించడం లేదని వాపోతున్నారు. అటు కోహ్లీ కెప్టెన్సీలో.. ఇటు రోహిత్ కెప్టెన్సీలో ఐసీసీ టైటిళ్లు గెలవలేకపోవడం దురదృష్టకరమని అంటున్నారు. ఈ ప్రపంచకప్‌లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ 500కు పైగా పరుగులు చేశాడు. లీగ్ దశలో తొలి మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్.. ఆ తర్వాతి మ్యాచ్ నుంచి ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్, ఆస్ట్రేలియాతో ఫైనల్లోనూ అదే తీరు ఫాలో అయ్యాడు. కానీ రోహిత్ అగ్రెసివ్‌గా ఆడుతూనే.. ఆచితూచి రాణిస్తే ఇంకా బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అటు మ్యాచ్ ముగిసిన తర్వాత ఫలితంపై రోహిత్ స్పందించాడు. తాము బ్యాటింగ్‌లో మరో 20-30 పరుగులు తక్కువ చేశామని తెలిపాడు. ఈరోజు బ్యాటింగ్ చేసిన తీరు నిరాశపరిచిందని.. కోహ్లీ, రాహుల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో 270 స్కోరు చేస్తామని భావించామని.. కానీ అలా జరగలేదని రోహిత్ అన్నాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 47 పరుగులకే 3 వికెట్లు తీసినా.. ఆ తర్వాత హెడ్, లబుషేన్ బాగా బ్యాటింగ్ చేశారని.. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బ్యాటింగ్ వాళ్లకు కలిసొచ్చిందని రోహిత్ తెలిపాడు.

Updated Date - 2023-11-19T22:48:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising