ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup Final: టీమిండియా ఫ్యాన్స్‌ను వెంటాడుతున్న నాలుగు భయాలు

ABN, First Publish Date - 2023-11-18T16:06:22+05:30

Team India Fans Tensions: ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. 2003 తర్వాత ఈ రెండు జట్లు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆడటం ఇది రెండోసారి. దీంతో ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అయితే అభిమానుల్లో నాలుగు భయాలు మాత్రం వెంటాడుతున్నాయి

వన్డే ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ జరగనుంది. 2003 తర్వాత ఈ రెండు జట్లు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆడటం ఇది రెండోసారి. దీంతో ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అయితే అభిమానుల్లో నాలుగు భయాలు మాత్రం వెంటాడుతున్నాయి. అవి ఏంటంటే.. 2003లో ఇండియాలో బీజేపీ రూలింగ్‌లో ఉండగా ఇప్పుడు కూడా బీజేపీనే రూలింగ్‌లో ఉంది. రెండో పాయింట్ ఏంటంటే.. 2003లో టీమిండియా వికెట్ కీపర్ రాహుల్ ద్రవిడ్ కాగా 2023లో కేఎల్ రాహుల్.. అంతేకాకుండా వీళ్లిద్దరూ వైస్ కెప్టెన్‌లే కావడం మరో ఆసక్తికర విషయం. అభిమానులు భయపడుతున్న మూడో పాయింట్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బరో. ఐసీసీ నాకౌట్లలో టీమిండియా ఆడుతున్న మ్యాచ్‌లో అతడు అంపైరింగ్ చేస్తే మనం ఓడిపోతామన్న నమ్మకం అందరినీ టెన్షన్ పుట్టిస్తోంది.

నాలుగో పాయింట్ మాత్రం కొంచెం విచిత్రమైందే. బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి మూడు, నాలుగేళ్ల గ్యాప్ తీసుకుని సినిమాలు తెరకెక్కిస్తుంటాడు. భారత్-ఆస్ట్రేలియా 2003 ఫైనల్లో తలపడిన ఏడాదిలో ఆయన తెరకెక్కించిన మున్నాభాయ్ ఎంబీబీఎస్ సినిమా డిసెంబరులో విడుదలైంది. ఇప్పుడు భారత్-ఆస్ట్రేలియా 2023లో ఫైనల్లో తలపడుతున్నారు. ఈ ఏడాది డిసెంబరులో కూడా రాజ్‌కుమార్ హిరాణి దర్శకత్వం వహించిన డంకీ సినిమా విడుదల కానుంది. యాధృచ్ఛికంగా ఇది జరుగుతున్నా టీమిండియా అభిమానులు మాత్రం ఈ అంశాన్ని సెంటిమెంట్‌గా ఫీలవుతూ భయపడుతున్నారు. అయితే కొన్ని సెంటిమెంట్లను కూడా టీమిండియా అభిమానులు గుర్తుచేస్తున్నారు. 2003లో ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌లలో గెలిచి ఫైనల్‌కు రాగా.. టీమిండియా 8 మ్యాచ్‌లలో గెలిచి ఫైనల్ చేరింది. అప్పుడు ఆస్ట్రేలియా మూడోసారి ప్రపంచకప్ గెలిచింది. ఇప్పుడు రివర్స్‌లో టీమిండియా 10 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ సమరానికి రాగా.. ఆస్ట్రేలియా 8 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పుడు టీమిండియా గెలిస్తే మూడోసారి విశ్వవిజేత కానుంది. దీంతో ఇండియాదే ప్రపంచకప్ అని అభిమానులు విశ్వసిస్తున్నారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-18T16:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising