ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team India: 2014 నుంచి ఇంతే.. బీజేపీ హయాంలో ఐసీసీ టైటిళ్లు గుండు సున్నా..!!

ABN, First Publish Date - 2023-11-19T21:55:22+05:30

2014లో దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీమిండియా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేదని సోషల్ మీడియాలో నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. టీమిండియా ఐసీసీ టోర్నీ గెలవాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దిగిపోవాలని కొందరు నెటిజన్‌లు కామెంట్ పెడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం క్రీడలకు, రాజకీయాలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ప్రదర్శన సంగతి పక్కన పెడితే ఇటీవల మన జట్టుకు విధి రాత ఏ మాత్రం కలిసిరావడం లేదు. ముఖ్యంగా 2011 తర్వాత ఇప్పటి వరకు వన్డే ప్రపంచకప్ గెలవలేదు. ఇంకా చెప్పుకుంటే 2014లో దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీమిండియా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవలేదని సోషల్ మీడియాలో నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. 2014లో టీ20 ప్రపంచకప్ ఫైనల్, 2015లో వన్డే ప్రపంచకప్ సెమీస్, 2016లో టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్, 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019లో వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్, 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, 2021లో టీ20 ప్రపంచకప్ లీగ్ దశ, 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్, 2023 ప్రపంచకప్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, తాజాగా 2023లో వన్డే ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైంది.

దీంతో టీమిండియా ఐసీసీ టోర్నీ గెలవాలంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దిగిపోవాలని కొందరు నెటిజన్‌లు కామెంట్ పెడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం క్రీడలకు, రాజకీయాలకు సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. బీసీసీఐ సెక్రటరీ జై షా ఎవరు అని.. అమిత్ షా తనయుడు కాబట్టే బీసీసీఐలో పాలి‘ట్రిక్స్’ నడుస్తున్నాయని.. అసలు ఫైనల్ అహ్మదాబాద్‌లో పెట్టడం అవివేకం అని.. దీనికి బీజేపీ ప్రభుత్వ అత్యుత్సాహమే కారణమని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సెంటిమెంట్లు ఉంటాయని.. వాటిని గౌరవించాలని హితవు పలుకుతున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫైనల్ నిర్వహిస్తే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా టీమిండియా మూడోసారి విశ్వవిజేతగా నిలుస్తుందని అభిమానులు విశ్వసించగా చివరకు వాళ్లకు నిరాశే మిగిలింది.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-19T22:12:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising