Asia Cup 2023: టీమిండియాకు షాక్.. తొలి రెండు మ్యాచ్‌లకు స్టార్ ఆటగాడు దూరం
ABN, First Publish Date - 2023-08-29T13:54:42+05:30
ఆసియా కప్ ప్రారంభానికి ముందే టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. చాలా కాలం తర్వాత ఆసియా కప్‌కు ఎంపికైన స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో పాకిస్థాన్, నేపాల్‌తో ఆడే మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరం కానున్నాడు. అతడి స్థానంలో టీమిండియా ఎవరికి చోటు ఇస్తుందో అన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఆసియా కప్ ప్రారంభానికి ముందే టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లకు స్టార్ ఆటగాడు దూరం కానున్నాడు. ఈ మేరకు బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేసింది. ఈనెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండగా.. టీమిండియా తన తొలి రెండు మ్యాచ్‌లను పాకిస్థాన్, నేపాల్ జట్లతో ఆడనుంది. అయితే చాలా కాలం తర్వాత ఆసియా కప్‌కు ఎంపికైన స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో పాకిస్థాన్, నేపాల్‌తో ఆడే మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరం కానున్నాడు. అతడి స్థానంలో టీమిండియా ఎవరికి చోటు ఇస్తుందో అన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఆసియా కప్‌లో సెప్టెంబర్ 2న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫైనల్ ఎలెవన్ ఎలా ఉంటుందో అని పలువురు ఉత్కంఠగా గమనిస్తున్నారు. రోహిత్, గిల్ ఓపెనర్లుగా బరిలోకి దిగితే కేఎల్ రాహుల్ మిడిలార్డర్‌లో దిగుతాడని అందరూ అంచనా వేశారు. వికెట్ కీపర్‌గా కూడా అతడే సేవలు అందిస్తాడని ఊహించారు. కానీ అనూహ్యంగా తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ ప్రకటించడంతో ఇప్పుడు అతడి స్థానంలో సంజు శాంసన్‌కు అవకాశం ఇస్తారా లేదా ఇషాన్ కిషన్‌ను తీసుకుంటారా అన్నది సస్పెన్స్‌గా మారింది. సీనియర్ ఆటగాడు దూరం కావడం భారత్‌ను దెబ్బతీస్తుందని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Wasim Akram: టీమిండియాపై వసీం అక్రమ్ విమర్శలు.. ఈసారి కూడా ఫైనల్ చేరలేదు
ఇటీవల గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్ బెంగళూరులోని శిక్షణా శిబిరంలో కంఫర్ట్‌గానే బ్యాటింగ్ చేశాడు. అతడికి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. 100 శాతం ఫిట్‌గా లేకపోవడంతో కేఎల్ రాహుల్‌కు మరో వారం విశ్రాంతి ఇవ్వాలని కోచ్ ద్రవిడ్ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. వన్డే ప్రపంచకప్ ముంగిట జట్టు ఎలాంటి రిస్క్ చేయడానికి సిద్ధంగా లేదని ద్రవిడ్ చెప్పినట్లు సమాచారం. వన్డే ప్రపంచకప్‌కు 18-20 నెలలకు ముందే జట్టుకు 4, 5 స్థానాలలో శ్రేయాస్ అయ్యర్, పంత్, కేఎల్ రాహుల్ ఆడతారని టీమ్ మేనేజ్‌మెంట్ భావించిందని.. కానీ వాళ్లంతా ఇప్పుడు గాయాల బారిన పడి కోలుకుంటున్నారని ద్రవిడ్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో వివరించాడు. కాగా ఆసియా కప్‌లో పాల్గొనేందుకు బుధవారం నాడు టీమిండియా శ్రీలంకకు బయలుదేరనుంది. తాజా పరిణామంతో కేఎల్ రాహుల్ వారం తర్వాతే టీమిండియాతో కలవనున్నాడు. సెప్టెంబర్ 3న వన్డే ప్రపంచకప్‌కు సెలక్టర్లు జట్టును ప్రకటించాల్సి ఉన్నందున కేఎల్ రాహుల్‌కు చోటు దక్కుతుందో లేదో వేచి చూడాలి.
Updated Date - 2023-08-29T14:06:04+05:30 IST