ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team India: ముచ్చటగా మూడోసారి పట్టేయాలి.. ప్రపంచకప్ ఫైనల్స్‌లో మన రికార్డు ఇదే..!!

ABN, First Publish Date - 2023-11-16T16:53:35+05:30

ODI World Cup History: టీమిండియా గతంలో మూడు సార్లు ఫైనల్‌కు వెళ్లగా రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచింది. 1983, 2003, 2011లలో టీమిండియా ఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం నాలుగో సారి టీమిండియా వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. సొంతగడ్డపై ఈ మెగా టోర్నీ జరుగుతుండటం ప్లస్ పాయింట్ కాగా.. మనోళ్లు ఒత్తిడికి గురికాకుండా ప్రత్యర్థి దక్షిణాఫ్రికా అయినా ఆస్ట్రేలియా అయినా ఆత్మవిశ్వాసంతో ఆడితే ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతలుగా నిలిచే అవకాశం ఉంటుంది.

ఎట్టకేలకు ఐసీసీ నాకౌట్లలో న్యూజిలాండ్ గండాన్ని టీమిండియా దిగ్విజయంగా దాటింది. 2019 నుంచి నాలుగు నాకౌట్లలో న్యూజిలాండ్‌తో తలపడిన టీమిండియా నాలుగోసారి విజయం అందుకుంది. 2019 వన్డే ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్, 2021 ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లలో మన జట్టుకు నిరాశ తప్పలేదు. దీంతో ఈసారి న్యూజిలాండ్‌ను ఓడించేందుకు టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అంతేకాకుండా దూకుడుగా బ్యాటింగ్ చేసి సహచరులను ప్రోత్సహించాడు. ఈ నేపథ్యంలో భారత్ ఏకంగా 397 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బౌలర్లు రాణించడంతో టీమిండియా 70 పరుగుల తేడాతో గెలిచి సగర్వంగా నాలుగోసారి ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరింది.

టీమిండియా గతంలో మూడు సార్లు ఫైనల్‌కు వెళ్లగా రెండు సార్లు విశ్వవిజేతగా నిలిచింది. 1983, 2003, 2011లలో టీమిండియా ఫైనల్‌కు చేరింది. 1983లో లార్డ్స్‌ వేదికగా జరిగిన ఫైనల్లో వెస్టిండీస్‌ను 43 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ అందుకుంది. కపిల్ దేవ్ సారథ్యంలో తొలిసారిగా ప్రపంచకప్‌ను ముద్దాడింది. అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత 2003లో గంగూలీ సారథ్యంలోని టీమిండియా దక్షిణాఫ్రికా గడ్డపై జోహన్నెస్ బర్గ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు వెళ్లింది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. కానీ మనోళ్లు ఒత్తిడికి గురికావడంతో ఛేదనలో చేతులెత్తేశారు. దీంతో 125 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. మళ్లీ 8 ఏళ్ల తర్వాత 2011లో సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ ఆధ్వర్యంలోని టీమిండియా ఫైనల్‌కు చేరింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది. ప్రస్తుతం నాలుగో సారి టీమిండియా వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. సొంతగడ్డపై ఈ మెగా టోర్నీ జరుగుతుండటం ప్లస్ పాయింట్ కాగా.. మనోళ్లు ఒత్తిడికి గురికాకుండా ప్రత్యర్థి దక్షిణాఫ్రికా అయినా ఆస్ట్రేలియా అయినా ఆత్మవిశ్వాసంతో ఆడితే ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతలుగా నిలిచే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు అత్యధికంగా ఆస్ట్రేలియా ఐదు సార్లు (1987, 1999, 2003, 2007, 2015) విశ్వవిజేతగా నిలవగా.. వెస్టిండీస్ రెండు సార్లు (1975, 1979), భారత్ రెండు సార్లు (1983, 2011) ప్రపంచకప్‌ను ముద్దాడాయి. శ్రీలంక (1996), పాకిస్థాన్ (1992), ఇంగ్లండ్ (2019) తలోసారి ప్రపంచకప్‌ను గెలుచుకున్నాయి.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-16T16:53:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising