ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup: సెమీస్ బెర్త్ ఖరారు.. శ్రీలంకపై టీమిండియా భారీ గెలుపు

ABN, First Publish Date - 2023-11-02T20:52:18+05:30

ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల భారీ తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో వరుసగా వన్డే ప్రపంచకప్‌లలో నాలుగోసారి సెమీస్‌లో అడుగుపెట్టింది.

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా అదరగొడుతోంది. వరుసగా ఏడో మ్యాచ్‌లోనూ గెలిచి అధికారికంగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. దీంతో వరుసగా వన్డే ప్రపంచకప్‌లలో నాలుగోసారి సెమీస్‌లో అడుగుపెట్టింది. 2011, 2015, 2019 ప్రపంచకప్‌లలోనూ సెమీస్ చేరిన భారత్.. ఇప్పుడు 2023లోనూ సెమీస్‌ బెర్త్ కైవసం చేసుకుంది. గురువారం ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 302 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను టీమిండియా బౌలర్లు హడలెత్తించారు. ఆసియా కప్ ఫైనల్‌ను రిపీట్ చేశారు. బుమ్రా తొలి బంతికే వికెట్ తీయగా మరో ఎండ్‌లో సిరాజ్ ఆసియా కప్ ప్రదర్శనను రిపీట్ చేశాడు. వీళ్లిద్దరికి మహ్మద్ షమీ కూడా తోడవ్వడంతో శ్రీలంక పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ ప్రపంచకప్‌లో ఆడుతున్న మూడో మ్యాచ్‌లోనే షమీ 5 వికెట్లతో చెలరేగడంతో 19.4 ఓవర్లలోనే 55 పరుగులకు ఆలౌటైంది.

ముఖ్యంగా శ్రీలంక బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. బౌలర్ కాసున్ రజిత (14) చేసిన పరుగులే అత్యధికం కావడం గమనించాల్సిన విషయం. బౌలర్ మహీష్ తీక్షణ 12 పరుగులు, ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్ 12 పరుగులు చేశారు. మొత్తం ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఓపెనర్లు నిశాంక, కరుణరత్నె అయితే గోల్డెన్ డకౌట్ అయ్యారు. అంతకుముందు టీమిండియా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 358 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

Updated Date - 2023-11-02T21:36:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising