ODI World Cup 2023: న్యూజిలాండ్‌పై ప్రతీకారం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా
ABN, First Publish Date - 2023-11-15T22:40:48+05:30
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఘనవిజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో 398 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఘనవిజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో 398 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే విలియమ్సన్ (69), మిచెల్ (134) రాణించడం టీమిండియా అభిమానులకు టెన్షన్ పుట్టించింది. కానీ షమీ విజృంభించాడు. ఏకంగా 7 వికెట్లు సాధించి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు.
అంతకుముందు టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ వన్డే కెరీర్లో 50వ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరోసారి అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. జట్టు స్కోరు 71 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. ఆ తర్వాత విరాట్‌తో కలిసి గిల్ కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే వ్యక్తిగత స్కోరు 80 పరుగుల వద్ద కాలి కండరాలు పట్టేయడంతో అనూహ్యంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ వరుసగా రెండవ శతకాన్ని నమోదు చేశాడు. కేవలం 70 బంతుల్లోనే 105 పరుగులు కొట్టి ఔటయ్యాడు. అయ్యర్ ఇన్నింగ్స్‌లో 8 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. రోహిత్ శర్మ (47), శుభ్‌మాన్ గిల్ (80 రిటైర్డ్ హర్ట్), విరాట్ కోహ్లీ (117), శ్రేయాస్ అయ్యర్ (105), కేఎల్ రాహుల్ (39 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(1) చొప్పున పరుగులు చేశారు.
Updated Date - 2023-11-15T22:41:57+05:30 IST