ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team India: టెస్టుల్లో టీమిండియా చెత్త రికార్డు.. 13 ఏళ్ల తర్వాత..!!

ABN, Publish Date - Dec 29 , 2023 | 04:52 PM

Team India: టెస్టుల్లో ఐసీసీ ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న టీమిండియా తాజాగా చెత్త రికార్డును నమోదు చేసింది. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన టీమిండియా 13 ఏళ్ల తర్వాత సఫారీ గడ్డపై చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

టెస్టుల్లో ఐసీసీ ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న టీమిండియా తాజాగా చెత్త రికార్డును నమోదు చేసింది. సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన టీమిండియా 13 ఏళ్ల తర్వాత సఫారీ గడ్డపై చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దక్షిణాఫ్రికాలో టీమిండియాకు ఇదే ఘోర పరాజయం. 13 ఏళ్ల క్రితం అంటే 2010లో డిసెంబర్‌లో జరిగిన టెస్టులో ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా తాజాగా ఇన్నింగ్స్ 31 పరుగుల తేడాతో ఓడిపోవడంతో దక్షిణాఫ్రికా గడ్డపై అతిపెద్ద పరాజయంగా నిలిచింది.

కాగా దక్షిణాఫ్రికాపై ఘోర పరాజయం ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో టీమిండియా అవకాశాలను దెబ్బతీసింది. స్లో ఓవర్ రేట్ కారణంగా కూడా టీమిండియా మరిన్ని పాయింట్లు కోల్పోయింది. దీంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. గత రెండు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లలో టీమిండియా ఫైనల్ వరకు వెళ్లింది. కానీ ఈసారి ఫైనల్ బెర్త్ కష్టమే అనిపిస్తోంది. టీమిండియా ర్యాంకు మెరుగుపడాలంటే జనవరిలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో అద్భుతంగా రాణించాలి. కానీ ప్రస్తుత టెస్టు జట్టులో మార్పులు చూస్తుంటే టీమిండియాకు ఇది కష్టంతో కూడుకున్న పనే అనిపిస్తోంది.


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 29 , 2023 | 06:22 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising