ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup: ఫైనల్‌ మ్యాచ్‌కు వచ్చే అతిరథ మహారథులు వీళ్లే..!!

ABN, First Publish Date - 2023-11-18T19:55:48+05:30

ODI World Cup: ఆదివారం నాడు అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మెగా ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరవుతున్నారు.

ఎంతో ఆసక్తి రేపిన వన్డే ప్రపంచకప్‌‌లో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం నాడు అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మెగా ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. ఆయనతో పాటు కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, జ్యోతిరాదిత్య సింథియా, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్, అమెరికా రాయబారి ఎరిక్ గస్సెట్టి, అస్సాం సీఎం హిమ్మత్ బిస్వా శర్మ, ఆస్ట్రేలియా డిప్యూటీ పీఎం రిచర్డ్ మార్లెస్, భారత్‌లోని ఆస్ట్రేలియా రాయబారి ఫిలిప్ గ్రీన్, రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇతర రాష్ట్రాల న్యాయస్థానాల న్యాయమూర్తులు, UAE రాయబారి అబ్దుల్నాసిర్ జమాల్ అల్షాలీ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, USA రాయబారి ఎరిక్ గార్సెట్టి, సింగపూర్ హోం వ్యవహారాల మంత్రి K సంగమ్, తమిళనాడు UT సంక్షేమ క్రీడల మంత్రి ఉదయనిధి స్టాలిన్ హాజరుకానున్నారు. వీరితో పాటు పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్ కూడా కుటుంబ సమేతంగా స్టేడియానికి చేరుకుని మ్యాచ్ వీక్షించనున్నారు. అంతేకాకుండా పలువురు బాలీవుడ్, టాలీవుడ్ తారలు కూడా స్టేడియంలో సందడి చేయనున్నారు. టాలీవుడ్ నుంచి విక్టరీ వెంకటేష్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో కనిపించనున్నారు.

కాగా ఈ ఫైనల్ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా వన్డే ప్రపంచకప్‌ గెలిచిన అన్ని జట్ల కెప్టెన్‌లను కూడా ఆహ్వానించారు. క్లైవ్‌ లాయిడ్‌, కపిల్‌ దేవ్‌, ధోనీ, అలెన్‌ బోర్డర్‌, స్టీవ్‌ వా, రికీ పాంటింగ్‌, మైకేల్‌ క్లార్క్‌, ఇయాన్‌ మోర్గాన్‌ రాకతో ఫైనల్‌ మరింత కలర్‌ఫుల్‌గా మారనుంది. వీరికోసం ప్రత్యేకమైన బ్లేజర్‌ను బీసీసీఐ తయారు చేయించింది. ఆ బ్లేజర్‌ను ధరించి వారంతా మ్యాచ్‌ను వీక్షిస్తారు. అయితే ప్రస్తుతం జైలులో ఉన్న కారణంగా పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, ఆ దేశ మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ మ్యాచ్‌కు హాజరు కావడం లేదు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-18T20:04:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising