ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: పెద్దోడిగా విరాట్ కోహ్లీ.. చిన్నోడిగా కేఎల్ రాహుల్.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వీడియో అదిరిపోయింది

ABN, First Publish Date - 2023-10-09T17:45:11+05:30

ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. అంతేకాకుండా మీమ్స్ రాయుళ్లు పోస్ట్ చేస్తున్న వీడియోలు కూడా ఆకట్టుకుంటున్నాయి.

వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతున్న టీమిండియాకు తొలి మ్యాచ్‌లోనే అగ్నిపరీక్ష ఎదురైంది. 200 పరుగుల లక్ష్యం ఛేదించే క్రమంలో రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో టీమిండియా పడింది. దీంతో క్రికెట్ అభిమానులకు టీమిండియా ఓడిపోతుందని భావించారు. కానీ ఛేదనలో కింగ్ విరాట్ కోహ్లీ, ఇటీవల అద్భుత ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ క్రీజులో ఉండటంతో అభిమానులు ఊపిరి బిగపట్టుకుని మ్యాచ్‌ను వీక్షించారు. వీళ్లిద్దరూ తమ అనుభవాన్ని ఉపయోగించి నెమ్మదిగా ఆడుతూ ఒక్కో పరుగును స్కోరు బోర్డులో జోడించారు. దీంతో టీమిండియా క్రమంగా విజయం వైపు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇద్దరూ హాఫ్ సెంచరీలతో రాణించారు. కేఎల్ రాహుల్ అయితే మూడు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

ఇది కూడా చదవండి: Team India: సెప్టెంబర్ ఆసియా కప్.. అక్టోబర్ ఏషియన్ గేమ్స్.. నవంబర్ వరల్డ్ కప్ లోడింగ్..!!

అయితే టీమిండియాను గెలిపించిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. అంతేకాకుండా మీమ్స్ రాయుళ్లు పోస్ట్ చేస్తున్న వీడియోలు కూడా ఆకట్టుకుంటున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా క్లైమాక్స్‌లో భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో కరెంట్ షాక్ నుంచి హీరోలు వెంకటేష్, మహేష్‌బాబు ప్రజలను కాపాడిన తరహాలో టీమిండియాను విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కాపాడారంటూ నెటిజన్‌లు అభినందిస్తున్నారు. అటు వెంకటేష్, మహేష్‌బాబులను చెరోవైపు కూర్చోబెట్టుకుని తండ్రి ప్రకాష్‌రాజ్ అభినందిస్తున్న సన్నివేశాన్ని టీమిండియాతో పేరడీ చేశారు. పెద్దోడిగా విరాట్ కోహ్లీని, చిన్నోడిగా కేఎల్ రా‌హుల్‌ను చూపించడమే కాకుండా ప్రకాష్‌రాజ్ పాత్రలో కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను మీమ్స్ రాయుళ్లు సెట్ చేశారు. దీంతో పేరడీ వీడియో అదిరిపోయిందని నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు. భలే గెలిపించార్రా అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Updated Date - 2023-10-09T17:45:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising