ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Virat Kohli: 25 ఏళ్ల గూగుల్ చరిత్రలో విరాట్ కోహ్లీ రికార్డు

ABN, First Publish Date - 2023-12-12T14:16:46+05:30

మైదానంలో బ్యాటుతో రికార్డులు బద్దలు కొట్టే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌లోనూ సత్తా చాటాడు. గూగుల్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా గూగుల్ చరిత్రలో అత్యధిక మంది శోధించిన అంశాలతో ఎక్స్‌లో ఓ వీడియోను అప్‌లోడ్ చేశారు.

మైదానంలో బ్యాటుతో రికార్డులు బద్దలు కొట్టే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్‌లోనూ సత్తా చాటాడు. గూగుల్ స్థాపించి 25 సంవత్సరాలు పూర్తైంది. ఈ సందర్భంగా గూగుల్ చరిత్రలో అత్యధిక మంది శోధించిన అంశాలతో ఎక్స్‌లో ఓ వీడియోను అప్‌లోడ్ చేశారు. ‘‘25 ఏళ్ల క్రితం ఈ ప్రపంచం వెతకడం ప్రారంభించింది. ఇక మిగతాదంతా చరిత్రే’’ అంటూ వీడియో మొదలైంది. ఆ వీడియో ప్రకారం గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అత్యధిక మంది శోధించిన అథ్లెట్‌గా ప్రముఖ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో నిలిచాడు. ఎక్కువ మంది శోధించిన ఆట ఫుట్‌బాల్ కాగా, ఎక్కువ మంది శోధించిన సినిమాగా బాలీవుడ్ మూవీ జానర్ నిలిచింది. గూగుల్‌లో ఈ సంవత్సరం అత్యధిక మంది శోధించిన వాటిలో కీడా టోర్నీల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో వన్డే ప్రపంచకప్, ఆసియాకప్, మహిళల ప్రీమియర్ లీగ్, ఆసియా క్రీడలు, ఇండియన్ సూపర్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, యాషెస్ సిరీస్, మహిళ క్రికెట్ ప్రపంచకప్, ఎస్‌ఏ20 నిలిచాయి.

ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-12T14:17:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising