ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Asia Cup 2023: వదిలిపెట్టని ఫ్యాన్స్.. విరాట్ కోహ్లీని తిట్టిన మ్యాంగో మేన్‌ ఎక్కడ?

ABN, First Publish Date - 2023-08-28T16:40:56+05:30

ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన గొడవ అప్పట్లో దుమారం రేపింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వీళ్ల మధ్య గొడవ వివాదాస్పదమైంది. దీంతో ఆసియా కప్‌లో భారత్, ఆప్ఘనిస్తాన్ మ్యాచ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఆప్ఘనిస్తాన్ టీమ్ అభిమానులకు షాకిచ్చింది. నవీన్ ఉల్ హక్‌ను ఆసియా కప్‌కు దూరం పెట్టింది.

ఆప్ఘనిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన గొడవ గురించి ఇంకా క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో జరిగిన ఈ గొడవ అప్పట్లో దుమారం రేపింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వీళ్ల మధ్య గొడవ వివాదాస్పదమైంది. దీంతో ఆసియా కప్‌లో భారత్, ఆప్ఘనిస్తాన్ మ్యాచ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. ట్విస్ట్ ఏంటంటే.. ఆసియా కప్ కోసం ఆప్ఘనిస్తాన్ ప్రకటించిన స్క్వాడ్‌లో నవీన్ ఉల్ హక్ లేకపోవడం టీమిండియా అభిమానులను నిరాశపరిచింది. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులు మ్యాంగో మేన్ ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

నిజానికి ఆర్సీబీ, లక్నో మ్యాచ్‌లో కోహ్లీ, నవీన్ మధ్య గొడవ తర్వాత మళ్లీ ఈ జట్ల ఐపీఎల్‌లో మధ్య మ్యాచ్ జరగలేదు. లక్నో ప్లే ఆఫ్స్‌కు చేరినా ఆర్సీబీ వెళ్లలేదు. దీంతో కోహ్లీ, నవీన్ మధ్య ఫైట్ చూద్దామని ఆశపడ్డ అభిమానులు నిరాశ పడ్డారు. దీంతో జూన్ లేదా జూలైలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు భారత్‌లో పర్యటించిన సమయంలో కోహ్లీ, నవీన్ మధ్య సమరం చూడొచ్చని అభిప్రాయపడ్డారు. కానీ అనూహ్యంగా ఆప్ఘనిస్తాన్ పర్యటన వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో అయినా వీళ్లిద్దరి మధ్య పోరు ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆశించారు. కానీ మరోసారి ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఆసియా కప్‌ టీమ్‌లో చోటు దక్కించుకోవడంలో నవీన్ ఉల్ హక్ విఫలమయ్యాడు. అతడి స్థానంలో కరీం జనత్‌కు సెలక్టర్లు స్థానం కల్పించారు. 6 ఏళ్ల తర్వాత ఆఫ్ఘనిస్థాన్ జట్టులో కరీం జనత్ చోటు దక్కించుకున్నాడు. చివరిసారిగా 2017లో జింబాబ్వేపై వన్డే ఆడిన జనత్ ఇప్పుడు ఆసియా కప్ ద్వారా పునరాగమనం చేస్తున్నాడు.


నవీన్‌కు మ్యాంగో మేన్ పేరు ఎలా వచ్చింది?

ఐపీఎల్ సమయంలో ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌ను టీవీలో చూస్తున్నానని చెప్తూ నవీన్ ఉల్ హక్ మామిడి పండ్లు తింటున్న ఫోటోను షేర్ చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులు నవీన్ ఉల్ హక్‌ను దారుణంగా ట్రోల్ చేశారు. అప్పటి నుంచి నవీన్‌కు మ్యాంగో మేన్ అని పేరు పెట్టారు.

ఆసియా కప్‌కు ఆప్ఘనిస్తాన్ టీమ్

హష్మతుల్లా షాహిది (కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్, ఇక్రమ్ అలిఖిల్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహమత్ షా, నజిబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, అబ్దుల్ రహమాన్, షరాపుద్దీన్ అష్రాఫ్, ముజీబుర్ రెహ్మాన్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం సఫి, ఫజల్ హక్ ఫరూఖీ

Updated Date - 2023-08-28T16:52:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising