ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Team India: పాకిస్థాన్ పేసర్‌ను కౌగిలించుకున్న విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

ABN, First Publish Date - 2023-09-02T14:03:25+05:30

కాసేపట్లో దాయాదులు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య మ్యాచ్ జరగనుంది. 2019 వరల్డ్ కప్ తర్వాత ఈ రెండు జట్లు వన్డేలో తొలిసారిగా తలపడుతున్నాయి. ఈ హై ఓల్టేజ్ సమరంలో ఎవరు గెలుస్తారా అని అభిమానులు టెన్షన్ పడుతుండగా ఆటగాళ్లు మాత్రం ఎంతో జాలీగా గడుపుతున్నారు. భారత్, పాకిస్థాన్ క్రికెటర్లు సరదాగా ముచ్చటించుకుంటున్న వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆసియా కప్‌-2023లో భాగంగా శ్రీలంకలోని క్యాండీ వేదికగా కాసేపట్లో దాయాదులు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య మ్యాచ్ జరగనుంది. 2019 వరల్డ్ కప్ తర్వాత ఈ రెండు జట్లు వన్డేలో తొలిసారిగా తలపడుతున్నాయి. ఈ హై ఓల్టేజ్ సమరంలో ఎవరు గెలుస్తారా అని అభిమానులు టెన్షన్ పడుతుండగా ఆటగాళ్లు మాత్రం ఎంతో జాలీగా గడుపుతున్నారు. భారత్, పాకిస్థాన్ క్రికెటర్లు సరదాగా ముచ్చటించుకుంటున్న వీడియోలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ పేసర్ హరీస్ రౌఫ్‌ను వాళ్ల డ్రెస్సింగ్ రూమ్ వద్ద టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కలిశాడు. అంతేకాకుండా అతడిని కౌగిలించుకున్నాడు. మరోవైపు పాకిస్థాన్ ఆటగాళ్లు షాదాబ్ ఖాన్, షహీన్ షా అఫ్రిదిలతో కూడా విరాట్ కోహ్లీ సరదాగా సంభాషించాడు. అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను కలిసి కాసేపు సరదాగా మాట్లాడాడు.

ఇది కూడా చదవండి: IND Vs PAK: వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే.. టీమిండియా పరిస్థితేంటి?

కాగా 2022 టీ20 ప్రపంచకప్‌లో హరీస్ రౌఫ్‌ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత సిక్సర్‌ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ కెరీర్‌లో‌నే గుర్తుండిపోయేలా అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడాడు. కోహ్లీ 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచి నాలుగు వికెట్ల తేడాతో భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. గత ఏడాది జరిగిన ఈ మ్యాచ్ భారత్, పాకిస్థాన్ అభిమానులకు ఎంతో ఉత్కంఠ అందించింది. చివరి బంతి వరకు విజేత ఎవరో అంచనా వేయలేని విధంగా మ్యాచ్ సాగింది. దీంతో దాయాదుల చరిత్రలో మరపురాని మ్యాచ్‌గా మిగిలిపోయింది. రెండు దేశాల మధ్య జరిగిన అత్యుత్తమ మ్యాచ్‌లను గుర్తుచేసుకుంటూ కోహ్లీ, రౌఫ్‌ సంభాషించుకుని ఉంటారని సోషల్ మీడియా వేదికగా క్రికెట్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Updated Date - 2023-09-02T14:03:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising