Virat Kohli: ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ ఎన్ని గంటలు బ్యాటింగ్ చేశాడంటే..?
ABN, First Publish Date - 2023-11-16T20:11:00+05:30
ODI World Cup 2023: ఈ ప్రపంచకప్‌లో అత్యధిక గంటలు క్రీజులో ఉన్న బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. సెమీఫైనల్ వరకు కోహ్లీ 18 గంటల 17 నిమిషాలు క్రీజులో గడిపాడు. ఇంకా ఫైనల్ మ్యాచ్ ఉండటంతో ఈ టైమ్ మరింత పెరగనుంది.
ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన అతడు మూడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీల సహాయంతో 711 పరుగులు చేశాడు. కోహ్లీ చేసిన రన్స్‌లో 64 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులతో పాటు అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాళ్లలో కోహ్లీనే అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే మరో విషయంలో కూడా కోహ్లీ టాప్‌లో కొనసాగుతున్నాడు. ఈ ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గంటలు క్రీజులో ఉన్న బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. సెమీఫైనల్ వరకు కోహ్లీ 18 గంటల 17 నిమిషాలు క్రీజులో గడిపాడు. ఇంకా ఫైనల్ మ్యాచ్ ఉండటంతో ఈ టైమ్ మరింత పెరగనుంది.
కాగా వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక సమయం క్రీజులో ఉన్న బ్యాటర్‌గా న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు 2019 ప్రపంచకప్‌లో 18 గంటల 51 నిమిషాలు క్రీజులో గడిపాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2003 ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ 18 గంటల 50 నిమిషాలు క్రీజులో ఉన్నాడు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉండగా అతడు ఫైనల్లో సుమారు 45 నిమిషాలు ఉంటే అగ్రస్థానంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ ఉన్నాడు. అతడు 2007 ప్రపంచకప్‌లో 17 గంటల 32 నిమిషాల పాటు క్రీజులో గడిపాడు.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-16T20:11:01+05:30 IST