ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cricket: సెంచరీ పూర్తయ్యాక బ్యాట్స్‌మెన్స్ ఎందుకు బ్యాట్ పైకెత్తుతారు?.. అందుకు కారణం ఇదే!

ABN, First Publish Date - 2023-11-14T14:14:12+05:30

బ్యాట్స్‌మెన్లు హాఫ్ సెంచరీలు, సెంచరీలు బాదేయాలనుకుంటారు. బౌలర్లు వికెట్ల మోత మోగించి క్రికెట్ చరిత్రలో నిలవాలనుకుంటారు. మరి బ్యాటర్స్ హాఫ్ సెంచరీ కొట్టినా..సెంచరీ సాధించినా బ్యాట్‌ను పైకెత్తుతారు. ఇక బౌలర్ు 5 వికెట్లు తీసినప్పుడు బంతిని పైకెత్తుతారు. ఇలా చేయడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి.

క్రికెట్ అనేది టీమ్ గేమ్. జట్టుగా రాణిస్తేనే విజయాలు సాధ్యం అవుతాయ్. వ్యక్తిగత ప్రదర్శనలు కీలకమే. కాకపోతే నిలకడగా విజయాలు సాధించాలంటే జట్టుగా రాణించాల్సిందే..! అయితే విజయాలతో పాటు వ్యక్తిగత ప్రదర్శనలు సైతం అభిమానులకు కిక్ ఇస్తాయి. ఆయా ప్లేయర్ల మీద అభిమానం పెరిగేలా చేస్తాయ్..! క్రికెటర్లు సాధించే ఒక్కో మైల్‌స్టోన్..వారి కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. అందుకే ప్రతి బ్యాటరూ పరుగుల పండుగ చేసుకోవాలనుకుంటాడు. బరిలో దిగినప్పుడల్లా మైల్‌స్టోన్స్‌ సెట్ చేయాలనుకుంటాడు. హాఫ్ సెంచరీలు, సెంచరీలు బాదేయాలనుకుంటాడు. బౌలర్లు కూడా అంతే..! వికెట్ల మోత మోగించి క్రికెట్ చరిత్రలో తమదైన సంతకం చేయాలనుకుంటారు. నిజానికి కెరీర్‌లో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ మైల్‌స్టోన్సే మధురానుభూతులుగా కనిపిస్తాయ్. ఏం సాధించామన్నదానికి నిలువెత్తు సాక్ష్యంగా ఉంటాయ్. అందుకే బ్యాటర్స్ హాఫ్ సెంచరీ కొట్టినా..సెంచరీ సాధించినా..సెల్రబేట్ చేసుకుంటారు.


బ్యాట్‌ను పైకెత్తేది ఇందుకే..

అప్పటి వరకు క్రీజులో పడిన కష్టానికి వచ్చిన ఫలితంగా ఆ పరుగులను చూస్తారు. హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోగానే బ్యాట్‌ను పైకి ఎత్తుతారు. ఒక్కో పరుగు సాధించేలా మద్దతుగా నిలిచిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఒత్తిడిని ఉఫ్‌మని ఊదేసి..జట్టు కోసం 50 సాధించానన్న కిక్కు కోసమూ బ్యాట్‌తో ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తారు. బ్యాటర్స్‌కు 50 పరుగులు అనేది ఓ బెంచ్ మార్క్. అందుకే ఆ మార్క్‌ను అందుకోగానే బ్యాట్‌ను పైకి ఎత్తడం సంప్రదాయంగా మారింది. 50 పరుగులు కొట్టడం ఒక ఎత్తయితే..వంద పరుగులు చేయడం మరో ఎత్తు. ఫార్మాట్ ఏదైనా సెంచరీ అనేది బ్యాటర్స్‌కు టానిక్‌లా పని చేస్తుంది. రికార్డుల మెట్టు ఎక్కడానికి ఉపయోగపడుతుంది. సెంచరీ చేసిన ప్రతిసారీ తానేంటో విమర్శకులకు సమాధానం చెప్పడానికి ఉపయోగపడుతుంది. జట్టు కోసం వంద పరుగులు చేశానన్న సంతృప్తి బ్యాటర్‌కు కలుగుతుంది. ఆ సంతృప్తిని మరో ఎండ్‌లో ఉన్న సహచర ప్లేయర్‌తో పాటు అభిమానులు, ఇతర టీమ్‌మేట్స్‌తోనూ బ్యాటర్స్ పంచుకుంటారు. మూడంకెల స్కోర్‌ను అందుకోగానే హెల్మెట్‌ను తీసేస్తారు..బ్యాట్‌నూ పైకెత్తుతారు. కొందరైతే..దేశంపై అభిమానం చాటుకుంటుంటారు. హెల్మెట్ మీద ఉండే క్రికెట్ బోర్డు గుర్తునో..నేషనల్ ఫ్లాగ్ ఇమేజ్‌నో ముద్దాడుతారు. డెడికేషన్‌తో శతకం సాధించామన్న మెస్సేజ్‌నూ ఇస్తారు.


ఇక బాల్‌తో మ్యాజిక్ చేసినప్పుడు బౌలర్లు కూడా సంబరాలు చేసుకుంటారు. గ్రౌండ్‌ను విడిచి వెళ్లేటప్పుడు చేతితో బాల్‌ను పైకెత్తి చూపిస్తారు. అయితే హాఫ్ సెంచరీ, సెంచరీ, ఫైవ్ వికెట్స్ హాల్ సాధించినప్పుడు ప్లేయర్లు ఇలాగే సెలెబ్రేట్ చేసుకోవాలని ఏమీ నిబంధన లేదు. కాకపోతే దశాబ్దాలుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. ఒకప్పటి బ్రాడ్‌మన్ నుంచి ఇప్పటి కేఎల్ రాహుల్ వరకు ఆ ట్రెండ్‌ను అందరూ కొనసాగిస్తున్నారు. రాబోయే క్రికెటర్లు కూడా ఈ ట్రెడిషన్‌ను ఫాలో అయిపోతారనడంలో ఎలాంటి డౌట్ లేదు!. ఆనందాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి, బాధ్యతను గుర్తు చేసుకోవడానికీ ఇదొక మార్గమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు!

Updated Date - 2023-11-14T14:15:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising