ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs AUS Final: ఫైనల్ మ్యాచ్ పిచ్, వెదర్ రిపోర్టు ఎలా ఉందంటే..? వర్షం వచ్చే అవకాశాలున్నాయా..?

ABN, First Publish Date - 2023-11-19T08:17:29+05:30

World Cup Final: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రపంచకప్ ట్రోఫీ కోసం తుది పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా 10 విజయాలతో ఫైనల్‌లో అడుగుపెట్టిన టీమిండియా తుది పోరులోనూ గెలిచి మూడో సారి ప్రపంచకప్ ట్రోఫీని గెలవాలని పట్టుదలగా ఉంది.

అహ్మదాబాద్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రపంచకప్ ట్రోఫీ కోసం తుది పోరులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వరుసగా 10 విజయాలతో ఫైనల్‌లో అడుగుపెట్టిన టీమిండియా తుది పోరులోనూ గెలిచి మూడో సారి ప్రపంచకప్ ట్రోఫీని గెలవాలని పట్టుదలగా ఉంది. టోర్నీ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత వరుసగా 8 విజయాలతో ఫైనల్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రేలియా ఆరో ప్రపంచకప్ ట్రోఫి గెలవడంపై దృష్టి పెట్టింది. టేబుల్‌పై రెండు .జట్లు బలంగా ఉండడంతో ఫైనల్ పోరు చివరి వరకు హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఫైనల్ పోరుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ టోర్నీలో పలు మ్యాచ్‌ల్లో పిచ్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగే అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది.


సాధారణంగా అహ్మదాబాద్ పిచ్‌పై బ్యాట్, బంతికి సమాన పోరు ఉంటుంది. ఇక్కడ బ్యాటర్లు లేదా బౌలర్లు వారు ప్రదర్శించే నైపుణ్యాన్ని బట్టి ఫలితం వస్తుంటుంది. అంటే బ్యాటర్లు సరిగ్గా బ్యాటింగ్ చేస్తూ క్రీజులో కుదురుకుంటే పరుగులు చేయవచ్చు. అదే విధంగా బౌలర్లు సరైన లైన్ అండ్ లెంగ్త్ మెయిటేన్ చేస్తూ బౌలింగ్ చేస్తే వికెట్లు తీయవచ్చు. ఇక్కడ సాధారణంగా రెండు రకాలు పిచ్‌లుంటాయి. ఒకటి బ్లాక్ సాయిల్ పిచ్ కాగా.. మరొటి రెడ్ సాయిల్ పిచ్. ఈ మ్యాచ్‌ కోసం భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సమయంలో ఉపయోగించిన బ్లాక్ సాయిల్ ఉపయోగించనున్నారు. దీంతో బంతి తక్కువ బౌన్స్‌ అవడంతో పాటు చక్కటి టర్న్‌ లభించనుంది. ఇక మ్యాచ్ ఫలితంలో టాస్ పెదగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఎప్పుడూ బ్యాటింగ్ చేసినా సత్తా ఉన్న జట్టునే విజయం వరిస్తుంది. అలాగే మ్యాచ్ కోసం స్లో పిచ్‌ను ఉపయోగించనున్నారని సమాచారం. దీంతో భారీ స్కోర్లు నమోదు కాకపోవచ్చు. ఇక్కడి గత రికార్డులు ఇవే చెబుతున్నాయి. మోదీ స్టేడియంలో ఇప్పటివరకు 30 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లు 15 మ్యాచ్‌ల్లో, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లు 15 సార్లు గెలిచాయి. మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 243గా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 208గా ఉంది. ఈ పిచ్‌పై అత్యధిక స్కోర్ 365 కాగా.. అత్యల్ప స్కోర్ 85గా ఉంది. ఇక్కడ అత్యధిక చేధన 325 పరుగులుగా ఉంది. టాస్ గెలిచిన జట్లు 17 మ్యాచ్‌ల్లో గెలిస్తే.. టాస్ ఓడిన జట్లు 13 మ్యాచ్‌ల్లో గెలిచాయి. అయితే ఈ టోర్నీలో ఇక్కడ జరిగిన 4 మ్యాచ్‌ల్లో చేజింగ్ చేసిన జట్లే మూడు గెలిచాయి. ఈ పిచ్‌లో స్పిన్నర్ల కన్నా పేసర్లకే ఎక్కువ వికెట్లు పడతాయని గత రికార్డులు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఇక్కడ పేస్ బౌలర్లు 246 వికెట్లు తీయగా.. స్పిన్ బౌలర్లు 135 వికెట్లు తీశారు.

వెదర్ రిపోర్టు విషయానికొస్తే మ్యాచ్ జరిగే అహ్మదాబాద్‌లో ఆదివారం వాతావరణం వేడిగా ఉండనుంది. దీంతో వర్షం వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. వన్డే ఫార్మాట్లో భారత్, ఆస్ట్రేలియా హెడ్ టూ హెడ్ వన్డే రికార్డుల విషయానికొస్తే ఇప్పటివరకు రెండు జట్లు 150 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. అత్యధికంగా ఆస్ట్రేలియా 83 మ్యాచ్‌ల్లో గెలిచింది. భారత జట్టు 57 మ్యాచ్‌ల్లో గెలిచింది. 10 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో రెండు జట్ల హెడ్ టూ హెడ్ రికార్డుల్లోనూ ఆసీస్‌దై పై చేయిగా ఉంది. రెండు జట్లు 8 మ్యాచ్‌ల్లో తలపడితే.. అత్యధికంగా 5 ఆస్ట్రేలియా, మూడింటిలో టీమిండియా గెలిచింది. నాకౌట్ పోరులోనూ ఆసీస్‌దే పై చేయిగా ఉంది. నాకౌట్ పోరులో రెండు జట్లు మూడు సార్లు తలపడితే కంగారులు రెండు సార్లు, టీమిండియా ఒక సారి గెలిచింది. ఆస్ట్రేలియా 2003 ప్రపంచకప్ ఫైనల్, 2015 ప్రపంచకప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో గెలవగా.. భారత్ 2011 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించింది.

Updated Date - 2023-11-19T08:20:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising