Ashes 2023: స్టోక్స్ పోరాటం వృథా.. రెండో టెస్ట్ కూడా ఆస్ట్రేలియాదే!..
ABN, First Publish Date - 2023-07-02T21:41:00+05:30
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో (Ashes Series 2023) ఆస్ట్రేలియా(Australia) జోరు కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి జోష్‌లో ఉన్న ఆసీస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ విజయకేతనం ఎగురవేసింది. దీంతో యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసింది. 371 పరుగుల భారీ లక్ష్య చేధనలో కెప్టెన్ బెన్ స్టోక్స్ (155) అద్బుతంగా పోరాడినప్పటికీ ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడంతో ఇంగ్లండ్‌కు(England) ఓటమి తప్పలేదు.
లార్డ్స్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో (Ashes Series 2023) ఆస్ట్రేలియా(Australia) జోరు కొనసాగుతుంది. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి జోష్‌లో ఉన్న ఆసీస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ విజయకేతనం ఎగురవేసింది. దీంతో యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసింది.
371 పరుగుల భారీ లక్ష్య చేధనలో కెప్టెన్ బెన్ స్టోక్స్ (155) అద్బుతంగా పోరాడినప్పటికీ ఇతర బ్యాటర్ల నుంచి సహకారం అందకపోవడంతో ఇంగ్లండ్‌కు(England) ఓటమి తప్పలేదు. 114/4 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌కు డకెట్(Ben Duckett), కెప్టెన్ స్టోక్స్(Ben Stokes) మంచి ఆరంభిన్నిచ్చారు. వీరిద్దరు మరో 63 పరుగులు జోడించారు. మొత్తంగా ఈ జంట ఐదో వికెట్‌కు 132 పరుగుల సెంచరీ పాట్నర్‌షిప్ నెలకొల్పింది. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే బెన్ డకెట్(83)ను పెవిలియన్ చేర్చి ఈ పాట్నర్‌షిప్‌ను హేజిల్‌వుడ్ విడదీశాడు. ఆ కాసేపటికే వికెట్ కీపర్ జానీ బెయిర్‌స్టో(10)ను గ్రీన్ పెవలియన్ చేర్చడంతో 193 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఓటమి అంచున నిలిచింది.
ఇలాంటి సమయంలో స్టూవర్ట్ బ్రాడ్ అండగా కెప్టెన్ బెన్ స్టోక్స్ అద్భుతంగా పోరాడాడు. బ్రాడ్ స్ట్రైక్ రోటేట్ చేయగా.. స్టోక్స్ మాత్రం వన్డే స్టైల్‌లో రెచ్చిపోయాడు. ధాటిగా ఆడుతూ ఇంగ్లండ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో టెస్ట్ కెరీర్లో 12వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడిన స్టోక్స్.. బ్రాడ్‌తో కలిసి ఏడో వికెట్‌కు సెంచరీ పాట్నర్‌షిప్ నెలకొల్పాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్కోర్ 300 దాటగా.. స్టోక్స్ 150 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఒకానొక దశలో స్టోక్స్ ఇంగ్లండ్‌ను గెలిపిస్తాడేమో అనిపించింది. కానీ హేజిల్‌వుడ్ వేసిన 73వ ఓవర్ మొదటి బంతికి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి స్టోక్స్ దొరికిపోవడంతో ఇంగ్లండ్ గెలుపు ఆశలు ఆవిరైపోయాయి. ధాటిగా ఆడిన స్టోక్స్ 9 ఫోర్లు, 9 సిక్సులతో 214 బంతుల్లో 155 పరుగులు చేశాడు.
ఆ తర్వాత ఇంగ్లండ్ ఆలౌటవడానికి ఎంతో సమయం పట్టలేదు. టేలెండర్లు విఫలవడంతో 327 పరుగుల వద్ద ఇంగ్లీష్ టీం పోరాటం ముగిసింది. దీంతో 43 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్ మూడేసి వికెట్లు.. గ్రీన్ ఒక వికెట్ తీశారు. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 416, ఇంగ్లండ్ 325 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 279, ఇంగ్లండ్ 327 పరుగులు చేసింది. స్టీవెన్ స్మిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్దు దక్కంది. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-0తో అధిక్యంలో నిలిచింది.
Updated Date - 2023-07-02T21:48:23+05:30 IST