ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs WI: మొదటి టీ20తో చరిత్ర సృష్టించనున్న భారత్.. ప్రపంచంలోనే రెండో టీంగా రికార్డు

ABN, First Publish Date - 2023-08-03T15:23:20+05:30

మొదటి మ్యాచ్‌తో భారత జట్టు 200 టీ20 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోనుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన జట్టుగా చరిత్ర స‌ృష్టించనుంది. ప్రపంచంలోనే పొట్టి క్రికెట్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పనుంది.

ట్రినిడాడ్: భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లు గెలిచి జోరు మీదున్న టీమిండియా టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో మొదటి టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని భారత జట్టు పట్టుదలగా ఉంది. అయితే ఈ మ్యాచ్‌తో భారత జట్టు 200 టీ20 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకోనుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన జట్టుగా చరిత్ర స‌ృష్టించనుంది. ప్రపంచంలోనే పొట్టి క్రికెట్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన రెండో జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పనుంది. కాగా టీ20 ఫార్మాట్‌లో టీమిండియా ఇప్పటివరకు 199 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 127 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 63 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 4 మ్యాచ్‌లు టైగా ముగియగా.. 5 మ్యాచ్‌లు రద్దయ్యాయి. మొత్తంగా టీమిండియా విజయాల శాతం 66.49గా ఉంది. దీంతో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన రెండో టీంగా రికార్డు నెలకొల్పింది.


కాగా భారత జట్టు టీ20 ఫార్మాట్‌లో తమ మొదటి మ్యాచ్‌ను 1 డిసెంబర్ 2006న ఆడింది. ఆ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్ వ్యవహరించాడు. జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక 2007లో జరిగిన మొట్ట మొదటి టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ధోని కెప్టెన్సీలో పాల్గొంది. మొదటి ప్రపంచకప్‌లోనే ట్రోఫి గెలిచి చరిత్ర స‌ృష్టించింది. కాగా ఈ జాబితాలో టీమిండియా కంటే ముందు పాకిస్థాన్ ఉంది. అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన రికార్డు పాక్ పేరిటే ఉంది. పాక్ ఇప్పటివరకు 223 మ్యాచ్‌లు ఆడింది. 134 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

ఇక గురువారం జరిగే భారత్, వెస్టిండీస్ మొదటి టీ20 మ్యాచ్‌కు రెండు జట్ల ప్లేయింగ్ ఈ విధంగా ఉండే అవకాశాలున్నాయి.

భారత్‌:

జైస్వాల్‌, ఇషాన్‌ కిషన్‌/శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), గిల్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా (కెప్టెన్‌), సూర్యకుమార్‌, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌, చాహల్‌/బిష్ణోయ్‌, ఉమ్రాన్‌/అవేశ్‌ ఖాన్‌, ముకేష్‌ కుమార్‌.

వెస్టిండీస్‌:

బ్రండన్‌ కింగ్‌, మేయర్స్‌, జాన్సన్‌ చార్లెస్/హోప్‌ (వికెట్‌ కీపర్‌), పూరన్‌, హెట్‌మయెర్‌, రోవ్‌మన్‌ పావెల్‌ (కెప్టెన్‌), రోస్టన్‌ చేజ్‌, హోల్డర్‌, షెఫర్డ్‌/ఓడెన్‌ స్మిత్‌, అకిల్‌ హొస్సేన్‌, జోసెఫ్/ఓషేన్‌ థామస్‌.

Updated Date - 2023-08-03T15:25:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising