ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HBH: హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ 2023 జెర్సీ విడుదల

ABN, First Publish Date - 2023-02-07T21:39:25+05:30

హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ (Hyderabad Black Hawks) 2023 సీజన్‌ రూపే వాలీబాల్‌ లీగ్‌ (Pro Volleyball League) నూతన జెర్సీని విడుదల చేసింది. చూడగానే ఆకట్టుకునే రీతిలో బ్లాక్‌, ఆరెంజ్‌ డిజైన్‌‌లో ఉంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ (Hyderabad Black Hawks) 2023 సీజన్‌ రూపే వాలీబాల్‌ లీగ్‌ (Pro Volleyball League) నూతన జెర్సీని విడుదల చేసింది. చూడగానే ఆకట్టుకునే రీతిలో బ్లాక్‌, ఆరెంజ్‌ డిజైన్‌‌లో ఉంది. ఈ జెర్సీని తెలంగాణ మంత్రి కేటీ రామారావు ఆవిష్కరించారు. ఆయనతో పాటుగా పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, తెలంగాణా ఒలింపిక్‌ బాడీ అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. ‘‘మన రాజధాని నగరంలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుండటంపై సంతోషంగా ఉన్నాం. హైదరాబాద్‌లో క్రీడల వృద్ధికి వ్యాపార సమాజం మద్దతు నిలుస్తోంది’’ అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షించారు. జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమానికి హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ యజమానులు, వ్యాపారవేత్తలు అభిషేక్‌ రెడ్డి కంకణాల (ప్రిన్సిపల్‌ ఓనర్‌), శ్యామ్‌ గోపు (సహ యజమాని) సమన్వయం చేశారు. హైదరాబాద్‌ టీమ్‌లో అంతగా అనుభవజ్ఞులు లేకపోయినప్పటికీ వారాంతంలో అహ్మదాబాద్‌పై అత్యుత్తమ ప్రదర్శనను ఈ టీమ్‌ కనబరిచింది.

ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ యజమానులు, వ్యాపారవేత్తలు అభిషేక్‌ రెడ్డి కంకణాల (ప్రిన్సిపల్‌ ఓనర్‌), శ్యామ్‌ గోపు (సహ యజమాని) సమన్వయం చేశారు. దేశంలో ప్రాథమిక స్థాయి నుంచి వాలీబాల్‌ అభివృద్ధి చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని, హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ టీమ్‌ ద్వారా యువతలో ఈ క్రీడ పట్ల ఆసక్తి కలిగించనున్నామని అభిషేక్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, కేటీఆర్‌, జయేష్‌ రంజన్‌‌లు తమ టీమ్‌కు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. వారి మద్ధతు తమ టీమ్‌కు ఆత్మవిశ్వాసం కలిగిస్తుందన్నారు. ఈ సీజన్‌లో చక్కటి ఆరంభానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పారు.

దేశంలో ప్రాథమిక స్థాయి నుంచి వాలీబాల్‌ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ టీమ్‌ ద్వారా యువతలో ఈ క్రీడ పట్ల ఆసక్తి కలిగించనున్నామని ప్రిన్సిపల్‌ యజమాని, అభిషేక్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, కేటీఆర్‌, జయేష్‌ రంజన్‌‌లు తమ టీమ్‌కు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. వారి మద్దతు టీమ్‌కు ఆత్మవిశ్వాసం కలిగిస్తుందన్నారు. ఈ సీజన్‌లో చక్కటి ఆరంభానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. బ్రెజిల్‌, ఇటలీ, జపాన్‌ లాంటి దేశాలలో అభివృద్ధి చెందుతున్న వాలీబాల్‌ సంస్కృతిని అనుకరించే మార్గంలో భారత్ ఉందని అభిషేక్‌ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-02-07T21:39:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising