ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs PAK: టీమిండియా ఇచ్చిన బహుమతికి కృతజ్ఞతలు: పాక్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-09-12T18:10:56+05:30

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా రెండు రోజులపాటు జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు పాకిస్థాన్‌పై 228 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.

కొలంబో: ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా రెండు రోజులపాటు జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు పాకిస్థాన్‌పై 228 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా ఇది రెండో అతి పెద్ద ఓటమి. దీంతో ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఆ జట్టు ప్రధాన కోచ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్ స్పందించాడు. భారత జట్టు తమకు ఇచ్చిన బహుమతికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లతో తాము తరచుగా ఆడడం లేదని అని చెప్పాడు. ప్రపంచకప్‌కు ముందు ఈ ఓటమి తమకు ఒక గుణపాఠం లాంటిందని అన్నాడు. "మేము గత మూడు నెలలుగా ఒక మ్యాచ్‌లో కూడా ఓడిపోలేదు. అందువల్ల మాకు ఈ ఓటమి ఒక గుణపాఠంగా భావిస్తున్నాం. ప్రతి రోజూ మెరుగుపడుతూ, మైదానంలో ఉత్తమ ఆట తీరును కనబరచాల్సిన అవసరం ఉంది. నిజానికి గత రెండు రోజులుగా మాకు లభించింది ఓ బహుమతి లాంటిది. మేము ఆట అన్ని కోణాల్లో ఓడిపోయాము. ఓటమికి ఎలాంటి సాకులు లేవు. గత రెండు రోజులుగా మేము సరిగ్గా ఆడలేదు.’’ అని బ్రాడ్‌బార్న్ చెప్పాడు.


అయితే తమ జట్టు తిరిగి పుంజుకుంటుందని బ్రాడ్‌బార్న్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. తమ బౌలింగ్ యూనిట్‌పై భారత్ ఎదురు దాడి చేయడంలో ఆశ్చర్యం లేదని ఆయన పేర్కొన్నాడు. తమ బౌలింగ్ దాడి ఎంత బలంగా ఉందో అందరికీ తెలుసని, అయితే మంచి జట్లు దానిపై ఎదురుదాడి చేస్తాయని చెప్పుకొచ్చాడు. అయితే తమ బ్యాటింగ్ ఆర్డర్ గత నెల రోజులుగా అంతగా రాణించలేక పోతుందన్న బ్రాడ్‌బర్న్.. తమ బ్యాటర్లు తిరిగి ఫామ్‌లోకి వస్తారని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక తమ జట్టు ఎంపికలో నిలకడగా ఉన్నట్టు బ్రాడ్‌బర్న్ పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమైన పాక్ చిత్తుగా ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 356 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగగా.. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం భారత బౌలర్లు చెలరేగడంతో పాకిస్థాన్ 128 పరుగులకే ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో చెలరేగాడు. దీంతో టీమిండియా 228 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.

Updated Date - 2023-09-12T18:10:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising