ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs SL: పాకిస్థాన్ లెజెండ్ రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. కోహ్లీతో కలిసి సరికొత్త రికార్డు!

ABN, First Publish Date - 2023-09-12T17:12:49+05:30

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు షాహీద్ ఆఫ్రిది రికార్డును టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు.

కొలంబో: ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ దిగ్గజ ఆటగాడు షాహీద్ ఆఫ్రిది రికార్డును టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు బాదిన హిట్‌మ్యాన్ ఆసియాకప్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్‌‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో ఆసియా కప్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన షాహీద్ ఆఫ్రిదిని అధిగమించాడు. ఆఫ్రిది ఇప్పటివరకు 26 సిక్సులు కొట్టగా.. ప్రస్తుతం హిట్‌మ్యాన్ ఖాతాలో 28 సిక్సులున్నాయి. అలాగే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి ఈ మ్యాచ్‌లో 10 పరుగుల భాగస్వామమే నెలకొల్పినప్పటి ఓ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. తమ వన్డే కెరీర్‌లో ఇద్దరు కలిసి 5 వేల పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. 86 ఇన్నింగ్స్‌లో 62 సగటుతో ఈ మార్కు అందుకున్నారు. ఇందులో 15 సార్లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలు, 18 సార్లు సెంచరీ భాగస్వామ్యాలున్నాయి. కాగా వన్డేల్లో 4 వేల పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీల్లో రోహిత్-కోహ్లీదే అత్యధిక సగటు కావడం గమనార్హం.


ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరోసారి శుభరంభాన్ని అందించారు. వీరిద్దరు మొదటి వికెట్‌కు 11 ఓవర్లలోనే 80 పరుగులు జోడించారు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. అయితే లంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే ఎంట్రీతో సీన్ మారిపోయింది. 11 పరుగుల వ్యవధిలోనే టీమిండియా టాప్ 3ని వెల్లలాగే పెవిలియన్ చేర్చాడు. రోహిత్, కిషన్ భాగస్వామ్యాన్ని దునిత్ వెల్లలాగే 12వ ఓవర్‌లో విడదీశాడు. 19 పరుగులు చేసిన గిల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ వెంటనే రోహిత్ శర్మ సిక్సు కొట్టి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 7 ఫోర్లు, 2 సిక్సులతో 44 బంతుల్లోనే హాఫ్ సెంచరీని చేశాడు. దీంతో ఆసియా కప్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీని కొట్టాడు. కాగా వన్డే కెరీర్‌లో రోహిత్‌కు ఇది 51వ హాఫ్ సెంచరీ. అయితే ఆ వెంటనే మరోసారి చెలరేగిన వెల్లలాగే విరాట్ కోహ్లీని 3 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే హాఫ్ సెంచరీతో చెలరేగుతున్న రోహిత్ శర్మను(53) వెల్లలాగే క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 91 పరుగులకు టీమిండియా 3 వికెట్లు కోల్పోయింది.

తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్(వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలాగే, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, మతీషా పతిరన

Updated Date - 2023-09-12T17:13:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising