కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND VS WI 2nd T20: భారత్‌.. అదే తీరు

ABN, First Publish Date - 2023-08-07T01:47:05+05:30

ఐదు టీ20 సిరీస్‌(Five T20 series)లో వెస్టిండీస్‌ జట్టు(West Indies team) అదరగొడుతోంది. నికోలస్‌ పూరన్‌(Nicholas Pooran) (40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 67) ఎడాపెడా బాదుడుకు రెండో మ్యాచ్‌లోనూ భారత జట్టు(Indian team)కు చుక్కెదురైంది.

IND VS WI 2nd T20: భారత్‌.. అదే తీరు

రెండో టీ20లోనూ ఓటమి

వణికించిన పూరన్‌

తిలక్‌ హాఫ్‌ సెంచరీ వృధా

ప్రావిడెన్స్‌ (గయానా)(Providence (Guyana): ఐదు టీ20 సిరీస్‌(Five T20 series)లో వెస్టిండీస్‌ జట్టు(West Indies team) అదరగొడుతోంది. నికోలస్‌ పూరన్‌(Nicholas Pooran) (40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 67) ఎడాపెడా బాదుడుకు రెండో మ్యాచ్‌లోనూ భారత జట్టు(Indian team)కు చుక్కెదురైంది. ఫలితంగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 2 వికెట్ల తేడాతో నెగ్గింది. తద్వారా సిరీస్‌లోనూ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. మంగళవారం మూడో టీ20(Third T20) జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ(Tilak Verma) (41 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 51) అర్ధసెంచరీ సాధించగా, ఇషాన్‌ (23 బంతుల్లో 27), హార్దిక్‌ (24) రాణించారు. ఆ తర్వాత ఛేదనలో విండీస్‌ 18.5 ఓవర్లలో 8 వికెట్లకు 155 రన్స్‌ చేసి నెగ్గింది. హార్దిక్‌కు మూడు, చాహల్‌కు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నికొలస్‌ పూరన్‌ నిలిచాడు.

చెలరేగిన పూరన్‌: 153 పరుగుల ఛేదనలో విండీ్‌సకు పేసర్‌ హార్దిక్‌ తొలి ఓవర్‌లోనే కింగ్‌ (0), చార్లెస్‌ (2) వికెట్లు తీసి ఝలక్‌ ఇచ్చాడు. కానీ ఈ సంబరాన్ని ఆవిరి చేస్తూ నికోలస్‌ పూరన్‌ చెలరేగాడు. మూడో ఓవర్‌లో 6,4,4 సాధించగా.. తర్వాతి ఓవర్‌లో మేయర్స్‌ 4,6 బాదినా అర్ష్‌దీప్‌ ఎల్బీ చేశాడు. అటు పూరన్‌ మాత్రం తన బ్యాట్‌కు పనిచెబుతూ ఆరో ఓవర్‌లో వరుసగా 4,6,4,4తో 18 రన్స్‌ రాబట్టాడు. ఈ ధాటికి అతను 28 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. నాలుగో వికెట్‌కు 57 పరుగుల జత చేరాక పావెల్‌ (21) అవుటయ్యాడు. విజయానికి మరో 27 రన్స్‌ దూరంలో పూరన్‌ను పేసర్‌ ముకేశ్‌ అవుట్‌ చేసి రిలీ్‌ఫనిచ్చాడు. ఇక 16వ ఓవర్‌లో రెండు పరుగులే ఇచ్చి హోల్డర్‌ (0), హెట్‌మయెర్‌ (22)లను చాహల్‌ అవుట్‌ చేయగా.. షెఫర్డ్‌ రనౌటయ్యాడు. దీంతో భారత్‌ పోటీలోకి వచ్చినట్టనిపించింది. కానీ అకీల్‌ హొసెన్‌ (16 నాటౌట్‌) ఎలాంటి ఒత్తిడీ లేకుండా 19వ ఓవర్‌లో 6,4తో మ్యాచ్‌ను ముగించాడు.


తిలక్‌ అర్ధసెంచరీ: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఈసారి కూడా శుభారంభం దక్కలేదు. పిచ్‌ అంతగా బ్యాటింగ్‌కు అనుకూలించకపోవడంతో తొలి 15 ఓవర్లలో కష్టంగా వంద పరుగులు పూర్తి చేయగలిగింది. అయితే ఎప్పటిలాగే తిలక్‌ వర్మ తనదైన శైలిలో చెలరేగాడు. తడబాటనేదే లేకుండా స్వేచ్ఛగా బ్యాట్‌ ఝుళిపిస్తూ కెరీర్‌లో తొలి అర్ధసెంచరీని అందుకున్నాడు. ఇషాన్‌తో మూడో వికెట్‌కు 42, హార్దిక్‌తో ఆరో వికెట్‌కు 38 పరుగులు జోడించాడు. మూడో ఓవర్‌లో గిల్‌ (7), తర్వాతి ఓవర్‌లోనే సూర్యకుమార్‌ (1) రనౌటయ్యాడు. పదో ఓవర్‌లో సిక్సర్‌తో ఊపు మీద కనిపించిన ఇషాన్‌.. షెఫర్డ్‌ బంతికి బౌల్డయ్యాడు. ఇక శాంసన్‌ (7) ఆట ఏడు బంతులకే పరిమితమైంది. అటు తిలక్‌ మాత్రం 11వ ఓవర్‌లో రెండు వరుస ఫోర్లతో వేగాన్ని తగ్గించలేదు. 13వ ఓవర్‌లో క్యాచ్‌ అవుట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్న తిలక్‌ స్కూప్‌, రివర్స్‌ స్వీప్‌ షాట్లతో ఆకట్టుకుంటూ 39 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ ఆ వెంటనే భారీ షాట్‌కు వెళ్లి, మెకాయ్‌కు ఫైన్‌ లెగ్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. స్పిన్నర్‌ హొసెన్‌కు ఈ వికెట్‌ దక్కింది. అనంతరం సిక్సర్‌తో టచ్‌లో ఉన్నట్టు కనిపించిన హార్దిక్‌ను సూపర్‌ యార్కర్‌తో జోసెఫ్‌ బౌల్డ్‌ చేశాడు. చివరి ఓవర్‌లో అక్షర్‌ (14) వికెట్‌ కోల్పోయినా.. అర్ష్‌దీప్‌ (6 నాటౌట్‌) ఫోర్‌, బిష్ణోయ్‌ (8 నాటౌట్‌) సిక్సర్‌తో 13 పరుగులు రావడంతో స్కోరు 150 దాటింది.

భారత్‌: ఇషాన్‌ (బి) షెపర్డ్‌ 27, గిల్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) జోసెఫ్‌ 7, సూర్య (రనౌట్‌/మేయర్స్‌) 1, తిలక్‌ వర్మ (సి) మెకాయ్‌ (బి) హొసెన్‌ 51, సంజూ (స్టంప్డ్‌) పూరన్‌ (బి) హొసెన్‌ 7, హార్దిక్‌ (బి) జోసెఫ్‌ 24, అక్షర్‌ (సి) పూరన్‌ (బి) షెఫర్డ్‌ 14, బిష్ణోయ్‌ (నాటౌట్‌) 8, అర్షదీప్‌ (నాటౌట్‌) 6, ఎక్స్‌ట్రాలు 7, మొత్తం: 20 ఓవర్లలో 152/7; వికెట్లపతనం: 1-16, 2-18, 3-60, 4-76, 5-114, 6-129, 7-139; బౌలింగ్‌: మెకాయ్‌ 4-0-25-0, హొసెన్‌ 4-0-29-2, జోసెఫ్‌ 4-0-28-2, హోల్డర్‌ 4-0-29-0, షెఫర్డ్‌ 3-0-28-2, మేయర్స్‌ 1-0-12-0.

వెస్టిండీస్‌: కింగ్‌ (సి) సూర్య (బి) హార్దిక్‌ 0, మేయర్స్‌ (ఎల్బీ) అర్షదీప్‌ 15, చార్లెస్‌ (సి) తిలక్‌ వర్మ (బి) హార్దిక్‌ 2, పూరన్‌ (సి) సంజూ (బి) ముకేశ్‌ 67, పావెల్‌ (సి) ముకేశ్‌ (బి) హార్దిక్‌ 21, హెట్‌మయెర్‌ (ఎల్బీ) చాహల్‌ 22, షెఫర్డ్‌ (రనౌట్‌) 0, హోల్డర్‌ (స్టంప్డ్‌) ఇషాన్‌ (బి) చాహల్‌ 0, హొసెన్‌ (నాటౌట్‌) 16, జోసెఫ్‌ (నాటౌట్‌) 10, ఎక్స్‌ట్రాలు 2, మొత్తం: 18.5 ఓవర్లలో 155/8; వికెట్ల పతనం: 1-0, 2-2, 3-32, 4-89, 5-126, 6-128, 7-128, 8-129; బౌలింగ్‌: హార్దిక్‌ 4-0-35-3, అర్షదీప్‌ సింగ్‌ 4-0-34-1, ముకేశ్‌ 3.5-0-35-1, రవి బిష్ణోయ్‌ 4-0-31-0, య జ్వేంద్ర చాహల్‌ 3-0-19-2.

Updated Date - 2023-08-07T04:08:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising