IND vs WI 2nd Test: మ్యాచ్ వేదికైనా ‘ట్రినిడాడ్’లో భారత్ గత రికార్డులు ఎలా ఉన్నాయో తెలుసా?..
ABN, First Publish Date - 2023-07-18T20:54:54+05:30
భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 20 నుంచి జరగనుంది. ఇప్పటికే మ్యాచ్ వేదికైన ట్రినిడాడ్ చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ వేదికైనా క్వీన్స్ పార్క్‌లో గత రికార్డులు ఎలా ఉన్నాయి? ఈ పిచ్‌పై భారత జట్టు గతంలో ఆడిన మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయనే అంశంపై ఆసక్తి నెలకొంది.
ట్రినిడాడ్: వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన భారత జట్టు అదే జోష్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకున్న సిరీస్ భారత సొంతం అవుతుంది. ఇప్పటికే మ్యాచ్ వేదికైన ట్రినిడాడ్ చేరుకున్న రోహిత్ సేన ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ వేదికైనా క్వీన్స్ పార్క్‌లో గత రికార్డులు ఎలా ఉన్నాయి? ఈ పిచ్‌పై భారత జట్టు గతంలో ఆడిన మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితాలు వచ్చాయనే అంశంపై ఆసక్తి నెలకొంది.
భారత్, వెస్టిండీస్ మ్యాచ్ వేదికైనా ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్, క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో ఇప్పటివరకు 61 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో వెస్టిండీస్ 20 మ్యాచ్‌లు గెలవగా.. ఇతర జట్లు 18 గెలిచాయి. ఇందులో 20 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గెలవగా.. 18 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. 23 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ పిచ్‌పై అత్యధిక స్కోర్ 681 పరుగులుగా ఉంది. 1954లో ఇంగ్లండ్‌పై విండీస్ జట్టు 8 వికెట్ల నష్టానికి 681 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అత్యల్ప స్కోర్ ఇంగ్లండ్ పేరు మీద ఉంది. 1994లో ఆ జట్టు 46 పరుగులకే ఆలౌటైంది. ఇక మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 302 పరుగులు కాగా.. సెకండ్ ఇన్నింగ్స్ సగటు స్కోర్ 314, మూడో ఇన్నింగ్స్ సగటు స్కోర్ 262, నాలుగో ఇన్నింగ్స్ సగటు 168గా ఉంది. ఈ పిచ్‌పై అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన రికార్డు మన టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ పేరు మీదనే ఉంది. 1971లో గవాస్కర్ 220 పరుగులు బాదేశాడు. అలాగే ఈ పిచ్‌పై అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్లలో గవాస్కర్ కూడా ఒకడు. గవాస్కర్ 4 సెంచరీలు చేశాడు. అత్యత్తమ బౌలింగ్ గణాంకాలు విండీస్ మాజీ బౌలర్ జాక్ నోరీగా పేరు మీద ఉన్నాయి. 1971లో జాన్ నోరీ 9 వికెట్లు తీశాడు.
ఇక క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో భారత జట్టుకు మంచి రికార్డులే ఉన్నాయి. ఈ మైదానంలో ఇప్పటివరకు వెస్టిండీస్‌తో టీమిండియా 13 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో భారత్, వెస్టిండీస్ చెరో 3 మ్యాచ్‌లు గెలిచాయి. 7 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. గెలిచిన మూడు మ్యాచ్‌ల్లో భారత జట్టు బ్యాటింగ్ సెకండ్ చేసినప్పుడు రెండు సార్లు, మొదట బ్యాటింగ్ చేసినప్పుడు ఒకసారి గెలిచింది. ఇక ఈ పిచ్‌పై టీమిండియా అత్యధిక స్కోర్ 469 పరుగులు. అత్యల్ప స్కోర్ 98 పరుగులు. అదే సమయంలో వెస్టిండీస్ అత్యధిక స్కోర్ 526, అత్యల్ప స్కోర్ 214గా ఉంది. గత రికార్డులు ఎలా ఉన్నా ప్రస్తుతం భారత జట్టు వెస్టిండీస్ కంటే అన్ని విధాల బలంగా ఉంది. కాబట్టి ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియానే హాట్ ఫెవరేట్‌గా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Updated Date - 2023-07-18T20:54:54+05:30 IST