ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs WI 3rd ODI: వరుసగా నాలుగో హాఫ్ సెంచరీ.. ఇషాన్ కిషన్ ఖాతాలో రెండు రికార్డులు

ABN, First Publish Date - 2023-08-01T20:31:15+05:30

వెస్టిండీస్ గడ్డపై టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ జోరు కొనసాగుతుంది. మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ కొట్టాడు. 5 ఫోర్లు, 2 సిక్సులతో 43 బంతుల్లోనే కిషన్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

ట్రినిడాడ్: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ జోరు కొనసాగుతుంది. మూడో వన్డేలోనూ హాఫ్ సెంచరీ కొట్టాడు. 5 ఫోర్లు, 2 సిక్సులతో 43 బంతుల్లోనే కిషన్ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డే కెరీర్‌లో కిషన్‌కు ఇది ఆరో హాఫ్ సెంచరీ. ఈ సిరీస్‌లో మూడో హాఫ్ సెంచరీ. కాగా ఈ సిరీస్‌లోని అన్ని వన్డేల్లో కిషన్ 50+ స్కోర్ సాధించడం గమనార్హం. ఇతర బ్యాటర్లంతా విఫలమైనా మొదటి రెండు వన్డేల్లోనూ కిషన్ హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ రెండు రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు. 3 వన్డేల సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌లోనూ 50+ రన్స్ చేసిన ఆరో భారత బ్యాటర్‌గా కిషన్ రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు రెండో టెస్టు మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ కిషన్ హాఫ్ సెంచరీ కొట్టాడు. దీంతో విండీస్ గడ్డపై వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కిషన్ 50+ స్కోర్ సాధించడం గమనార్హం. ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్‌గా కిషన్ రికార్డు నెలకొల్పాడు.


కాగా రెండు టెస్టు మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ మెరుపు బ్యాటింగ్ చేశాడు. 4 ఫోర్లు, 2 సిక్సులతో 34 బంతుల్లోనే 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక మొదటి వన్డే మ్యాచ్‌లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 46 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. రెండో వన్డేలో టీమిండియా ఓడినప్పటికీ కిషన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 55 బంతుల్లో 55 పరుగులు చేశాడు. చివరిదైనా మూడో వన్డేలో 8 ఫోర్లు, 3 సిక్సులతో 64 బంతుల్లో 77 పరుగులు చేశాడు. ఈ లెక్కన రానున్న వన్డే ప్రపంచకప్‌లో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా కిషన్ వికెట్ కీపర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కూడా కావడం అతనికి మరింత సానుకులాంశంగా చెప్పుకోవచ్చు.

Updated Date - 2023-08-01T20:32:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising