ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs WI 3rd ODI: జయదేవ్ ఉనద్కత్ ఖాతాలో అరుదైన ఘనత.. ఏకంగా 3,539 రోజుల తర్వాత..

ABN, First Publish Date - 2023-08-01T21:16:47+05:30

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో(India vs West Indies 3rd ODI) పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు(Jaydev Unadkat) టీమిండియా(Teamindia) తుది జట్టులో చోటు దక్కింది. అయితే జయవదేవ్ ఉనద్కత్‌కు ఏకంగా 3,539 రోజుల తర్వాత మళ్లీ భారత వన్డే జట్టులో చోటు దక్కడం గమనార్హం.

ట్రినిడాడ్: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో(India vs West Indies 3rd ODI) పేసర్ జయదేవ్ ఉనద్కత్‌కు(Jaydev Unadkat) టీమిండియా(Teamindia) తుది జట్టులో చోటు దక్కింది. అయితే జయవదేవ్ ఉనద్కత్‌కు ఏకంగా 3,539 రోజుల తర్వాత మళ్లీ భారత వన్డే జట్టులో చోటు దక్కడం గమనార్హం. అంటే 10 సంవత్సరాల పాటు వన్డే జట్టుకు దూరంగా ఉన్నాడు. దీంతో వన్డే ఫార్మాట్‌లో అత్యధిక కాలం విరామం తీసుకున్న ఆటగాడిగా నిలిచాడు. అనగా 31 ఏళ్ల ఉనద్కత్ తన చివరి వన్డే మ్యాచ్‌ను 21 నవంబర్ 2013న వెస్టిండీస్‌తో ఆడాడు. ఆ తర్వాత పలు కారణాలతో జట్టుకు దూరమయ్యాడు. తాజాగా అదే వెస్టిండీస్‌తో మళ్లీ వన్డేల్లోకి రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం. కాగా జయదేవ్ ఉనద్కత్ తన మొట్టమొదటి వన్డే మ్యాచ్‌ను 24 జులై 2013న జింబాబ్వేతో ఆడాడు. 7 వన్డేలు ఆడాక జట్టుకు దూరమయ్యాడు. తాజాగా ఆడుతున్నది జయదేవ్ ఉనద్కత్‌కు 8 వన్డే మ్యాచ్.


కాగా టెస్టుల్లోనూ జయదేవ్ ఉనద్కత్‌ది ఇదే పరిస్థితి. 16 డిసెంబర్ 2010న సౌతాఫ్రికాతో టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఉనద్కత్ ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. ఏకంగా 12 సంవత్సరాలపాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. 12 సంవత్సరాల తర్వాత గతేడాది డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ 12 ఏళ్ల కాలంలో టీమిండియా 118 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఈ క్రమంలో అత్యధిక టెస్టు మ్యాచ్‌ల విరామం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రెండో క్రికెటర్‌గా ఉనద్కత్ నిలిచాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ క్రికెటర్ గారెత్ బట్టీ మొదటి స్థానంలో ఉన్నాడు. గారెత్ ఏకంగా 142 టెస్టు మ్యాచ్‌ల విరామం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

Updated Date - 2023-08-01T21:16:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising