ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs WI: తెలుగోడికి చోటు డౌటే.. ఇద్దరు అరంగేట్రం.. మొదటి టెస్ట్‌‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!..

ABN, First Publish Date - 2023-07-11T12:24:58+05:30

మొదటి టెస్ట్ మ్యాచ్‌కు తుది జట్టును ఎంపిక చేయడం టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఓపెనింగ్‌లో రోహిత్‌కు జతగా ఎవరిని ఆడించాలి? వికెట్ కీపింగ్‌ బాధ్యతలను ఎవరి అప్పగించాలి? స్పిన్ డిపార్ట్‌మెంట్లో ఎవరినీ బెంచ్‌కు పరిమితం చేయాలనే అంశంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ తర్జన భర్జన పడుతున్నారని సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డొమినికా: భారత్, వెస్టిండీస్ టెస్ట్ సమరానికి సమయం ఆసన్నమైంది. బుధవారం నుంచే ఇరు జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో భాగంగానే డొమినికాలోని విండ్సర్ పార్క్ మైదానం వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం ఇప్పటికే మ్యాచ్ వేదికైనా డొమినికా చేరుకున్న భారత జట్టు ముమ్మర సాధన చేస్తోంది. అయితే మొదటి టెస్ట్ మ్యాచ్‌కు తుది జట్టును ఎంపిక చేయడం టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఓపెనింగ్‌లో రోహిత్‌కు జతగా ఎవరిని ఆడించాలి? వికెట్ కీపింగ్‌ బాధ్యతలను ఎవరి అప్పగించాలి? స్పిన్ డిపార్ట్‌మెంట్లో ఎవరినీ బెంచ్‌కు పరిమితం చేయాలనే అంశంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ తర్జన భర్జన పడుతున్నారని సమాచారం. ఈ క్రమంలో మొదటి టెస్ట్ మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండే అవకాశాలున్నాయో పరిశీలిద్దాం.


తుది జట్లులో ముగ్గురు ఓపెనర్లు ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌తోపాటు యశస్విజైస్వాల్ తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఖరారు కాగా.. అతనికి జతగా గిల్, జైస్వాల్‌లో ఎవరినీ పంపుతారనేది ఆసక్తికరంగా మారింది. కొంత కాలంగా రోహిత్‌కు జతగా గిల్ ఆడుతున్నాడు. కానీ టీమ్‌మేనేజ్‌మెంట్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్‌ కాంబినేషన్ కోసం చూస్తే జైస్వాల్ ఓపెనర్‌గా రావడం ఖాయం. అప్పుడు గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. కానీ ప్రస్తుత అంచనాల ప్రకారం అది జరగకపోవచ్చు. ఓపెనర్లుగా రోహిత్, గిల్‌నే పంపి జైస్వాల్‌నే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపొచ్చు. దీనిని బట్టి ఈ మ్యాచ్‌ ద్వారా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయబోతున్నాడు. ఇక నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ, ఐదో స్థానంలో వైస్ కెప్టెన్ అజింక్యా రహానే బ్యాటింగ్‌కు రానున్నారు. అయితే వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్, కేఎస్ భరత్‌లలో ఎవరిని ఆడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. భరత్‌కు ఎన్ని అవకాశాలు ఇచ్చినా కీపర్‌గా ఆకట్టుకుంటున్నాడు కానీ, బ్యాటర్‌గా రాణించలేకపోతున్నాడు. దీంతో ఈ సారి భరత్‌కు తుది జట్టులో చోటు కష్టమే. ఇషాన్ కిషన్‌ను ఆడించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పైగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ కూడా కావడం కిషన్‌కు కలిసిరానుంది. దీంతో తెలుగు ఆటగాడైన భరత్‌ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఇప్పటికే వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. టెస్టుల్లో కూడా అరంగేట్ర చేస్తాడు.

విండ్సర్ పార్క్ పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని కనుక భారత జట్టు ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గరు పేసర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. దీంతో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు ఖాయం కాగా.. మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ అక్షర్ పటేల్‌కు బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఇక టెస్టుల్లో అశ్విన్ బ్యాటింగ్ సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పేస్ కోటాలో మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌తోపాటు జయదేవ్ ఉనాద్కత్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పేస్ డిపార్ట్‌మెంట్‌ను సిరాజ్ లీడ్ చేయనున్నాడు. బ్యాటింగ్‌లో కూడా రాణించే సత్తా ఉండడం శార్దూల్‌కు కలిసిరానుంది. దీంతో నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్ బెంచ్‌కే పరిమితం కానున్నారు.

టీమిండియా తుది జట్టు(అంచనా):

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్.

Updated Date - 2023-07-11T12:27:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising