ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs WI: టీమిండియా ఆటగాళ్లకు కొడుకుతో కలిసి స్వాగతం పలికిన బ్రావో! వీడియోపై ఓ లుక్కేయండి..

ABN, First Publish Date - 2023-08-01T16:48:52+05:30

భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చనున్న మూడో వన్డే మ్యాచ్ మంగళవారం ట్రినిడాడ్‌లోని టరుబాలో గల బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్ వేదికైనా టరుబాకు చేరుకున్నారు. ఈ క్రమంలో మన ఆటగాళ్లకు వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో తన కుమారుడితో కలిసి స్వాగతం పలికాడు.

ట్రినిడాడ్: భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చనున్న మూడో వన్డే మ్యాచ్ మంగళవారం ట్రినిడాడ్‌లోని టరుబాలో గల బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇందుకోసం టీమిండియా ఆటగాళ్లు మ్యాచ్ వేదికైనా టరుబాకు చేరుకున్నారు. ఈ క్రమంలో మన ఆటగాళ్లకు వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో తన కుమారుడితో కలిసి స్వాగతం పలికాడు. దీనికి సంబంధించిన 46 సెకన్ల వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సదరు వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం బస్సు దిగి వస్తున్న ఆటగాళ్లందరినీ ఒక్కొక్కరిగా బ్రావో ప్రత్యేకంగా పలకరించాడు. వారితో కరచాలనం చేసి ముచ్చటించాడు. ఆ సమయంలో బ్రావో తన కొడుకును ఎత్తుకుని ఉన్నాడు. బ్రావోను కలిసిన భారత ఆటగాళ్లు అతని కొడుకును కూడా అప్యాయంగా పలకరించారు. ఐపీఎల్‌లోని చెన్నైసూపర్ కింగ్స్‌ టీంలో తన సహచర ఆటగాళ్లైనా రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్‌ను కలిసి బ్రావో వారిని కౌగిలించుకున్నాడు. చివరగా బ్రావోను కలిసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. అతని కొడుకుతో ప్రత్యేకంగా ముచ్చటించడం వీడియోలో కనిపించింది. చివరగా రుతురాజ్ గైక్వాడ్, బ్రావో సోఫాలో కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు.


ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన 39 ఏళ్ల బ్రావో పలు లీగ్ క్రికెట్‌లో మాత్రం ఆడుతున్నాడు. ఇటీవల ముగిసిన మేజర్ క్రికెట్ లీగ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తన అంతర్జాతీయ క్రికెట్‌లో విండీస్ తరఫున 40 టెస్టులు, 164 వన్డేలు, 91 టీ20లు ఆడిన ఈ మాజీ ఆల్‌రౌండర్ బ్యాట్‌తో, బాల్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ జట్టుకు విశేష సేవలు అందించాడు. బ్యాటర్‌గా టెస్టుల్లో 2,200, వన్డేల్లో 2968, టీ20ల్లో 1255 పరుగులు చేశాడు. ఇక బౌలర్‌గా టెస్టుల్లో 86 వికెట్లు, వన్డేల్లో 199 వికెట్లు, టీ20ల్లో 78 వికెట్లు పడగొట్టాడు. కాగా బ్రావోకు భారత్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో సుదీర్ఘకాలంపాటు చెన్నైసూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

Updated Date - 2023-08-01T17:03:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising