ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ind vs Wi: మరో 3 వికెట్లు తీస్తే అశ్విన్ ఖాతాలో అరుదైన రికార్డు.. మూడో భారత ఆటగాడిగా..

ABN, First Publish Date - 2023-07-11T14:11:04+05:30

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 3 వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. మొత్తంగా 16వ బౌలర్‌గా.. ఆరో స్పిన్నర్‌గా నిలుస్తాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 3 వికెట్లు తీస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లను పూర్తి చేసుకుంటాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. మొత్తంగా 16వ బౌలర్‌గా.. ఆరో స్పిన్నర్‌గా నిలుస్తాడు. కాగా బుధవారం నుంచి వెస్టిండీస్‌తో ప్రారంభం కాబోయే మొదటి టెస్ట్ మ్యాచ్‌తోనే అశ్విన్ ఈ రికార్డును చేరుకునే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి ఇప్పటివరకు 270 మ్యాచ్‌లాడిన అశ్విన్ 697 వికెట్లు పడగొట్టాడు. 92 టెస్టుల్లో 474 వికెట్లు, 113 వన్డేల్లో 151 వికెట్లు, 65 టీ20ల్లో 72 వికెట్లు తీశాడు. టెస్టు ఫార్మాట్లో బ్యాటింగ్‌లోనూ అశ్విన్‌కు మంచి రికార్డులున్నాయి. 26 సగటుతో 3,129 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు కూడా ఉన్నాయి.


ఇక వెస్టిండీస్‌పై అశ్విన్‌కు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో మంచి రికార్డులున్నాయి. కరేబియన్లతో 11 టెస్టు మ్యాచ్‌లాడిన ఈ సినియర్ స్పిన్నర్ 21 సగటుతో ఏకంగా 60 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లోనూ 552 పరుగులు చేశాడు. కెరీర్లో సాధించిన 5 సెంచరీల్లో ఏకంగా 4 సెంచరీలు వెస్టిండీస్‌పైనే బాదేశాడు. విండీస్ గడ్డపై కూడా అశ్విన్‌కు మంచి రికార్డులున్నాయి. విండీస్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లాడిన అశ్విన్ 17 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో ఏకంగా 58 సగటుతో పరుగులు రాబట్టాడు. ఇందులో రెండు సెంచరీలు ఉండడం గమనార్హం.

ఇక అశ్విన్ కంటే ముందు 700 వికెట్ల రికార్డును అందుకున్న భారత బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే, హర్బజన్ సింగ్ ఉన్నారు. అనిల్ కుంబ్లే మొత్తంగా 956 వికెట్లు పడగొట్టగా.. హర్బజన్ సింగ్ 711 వికెట్లు తీశాడు. మొత్తంగా శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. మురళీధరన్ ఏకంగా 1,347 వికెట్లు పడగొట్టాడు.

Updated Date - 2023-07-11T14:11:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising