ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

IND vs WI 2nd Test: కలవర పెడుతున్న వరుణుడు.. మ్యాచ్ జరిగే 5 రోజులు అడ్డుపడే అవకాశాలు

ABN, First Publish Date - 2023-07-20T15:26:27+05:30

మరికాసేపట్లో భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ గెలిచిన ఊపులో ఉన్న భారత జట్టు రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుతం రోహిత్ సేన అన్ని విధాల బలంగా ఉంది. స్థాయి తగ్గ ప్రదర్శన కనబరిస్తే గెలుపు పెదగా కష్టం కాకపోవచ్చు.

ట్రినిడాడ్: మరికాసేపట్లో భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ గెలిచిన ఊపులో ఉన్న భారత జట్టు రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. ప్రస్తుతం రోహిత్ సేన అన్ని విధాల బలంగా ఉంది. స్థాయి తగ్గ ప్రదర్శన కనబరిస్తే గెలుపు పెదగా కష్టం కాకపోవచ్చు. అటు అతిథ్య వెస్టిండీస్ జట్టు మాత్రం అంత బలంగా కనిపించడంలేదు. స్టార్ ఆటగాళ్లతో కూడిన టీమిండియాకు కాస్త బలహీనంగా కనిపిస్తున్న విండీస్ ఈ మ్యాచ్‌లోనైనా పోటీ ఇస్తుందా? లేదా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. టేబుల్‌పై బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ సొంత మైదానంలో కరేబియన్లను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని విశ్లేషకులు టీమిండియాను హెచ్చరిస్తున్నారు. సిరీస్ కాపాడుకోవడానికి విండీస్ కూడా అన్ని విధాల ప్రయత్నిస్తుందని చెబుతున్నారు.. ఈ మ్యాచ్ డ్రా అయినా సిరీస్ భారత్ వశం అవుతుంది. కాబట్టి ఆ జట్టు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగడం ఖాయమనే చెప్పుకోవాలి.


మ్యాచ్ ఫలితం ఎలా ఉండబోతుందనే అంశం కాస్త పక్కన పెడితే రెండు జట్లను వరుణుడు కాస్త కలవరపెడుతున్నాడు. స్థానిక వాతావరణ నివేదికల ప్రకారం మ్యాచ్ వేదికైగా ట్రినిడాడ్‌లో వర్షం పడే అవకాశాలున్నాయి. అది కూడా ఒక రోజో, రెండు రోజులో కాదు మ్యాచ్ జరిగే 5 రోజులు వరుణుడు అడ్డుపడే అవకాశాలు ఉండడం అభిమానులను కలవరపెడుతోంది. మొదటి రోజు మొదటి సెషన్‌లోనే వరుణుడు అడ్డు పడే అవకాశాలు లేకపోలేదు. అయితే 5 రోజులు పూర్తిగా పడకపోయినప్పటికీ మధ్య మధ్యలో అడ్డు తగిలే అవకాశాలున్నాయి. దీంతో వర్షం వల్ల పూర్తి ఆట సాధ్యం అయ్యే అవకాశాలు లేవు. ప్రస్తుతం మ్యాచ్ జరిగే పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌ మైదానంలో వాతావరణం మూఘావృతమై ఉంది. మ్యాచ్ జరిగే 5 రోజులు అత్యధిక ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి. 80 శాతం తేమ ఉండనుండగా.. గంటకు 10 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-07-20T15:26:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising