IND vs WI: రెండో టెస్ట్ మ్యాచ్‌తో చరిత్ర సృష్టించనున్న విరాట్ కోహ్లీ
ABN, First Publish Date - 2023-07-15T18:27:31+05:30
ఈ నెల 20 నుంచి భారత్, వెస్టిండీస్(West Indies vs India 2nd Test) మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌తో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) చరిత్ర సృష్టించనున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో కింగ్ కోహ్లీ ఇప్పటివరకు 499 మ్యాచ్‌లు ఆడాడు. దీంతో రెండో టెస్ట్ మ్యాచ్‌తో తన కెరీర్‌లో 500 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు.
ఈ నెల 20 నుంచి భారత్, వెస్టిండీస్(West Indies vs India 2nd Test) మధ్య జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌తో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) చరిత్ర సృష్టించనున్నాడు. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో కింగ్ కోహ్లీ ఇప్పటివరకు 499 మ్యాచ్‌లు ఆడాడు. దీంతో రెండో టెస్ట్ మ్యాచ్‌తో తన కెరీర్‌లో 500 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 500 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పనున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో టీమిండియా ఆటగాడిగా నిలవనున్నాడు. మొత్తంగా 10వ ఆటగాడిగా ఘనత సాధించనున్నాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ తన 15 ఏళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు 110 టెస్ట్‌లు, 274 వన్డేలు, 115 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 8,555, వన్డేల్లో 12,898, టీ20ల్లో 4,008 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 53 సగటుతో 25,461 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 75 సెంచరీలున్నాయి.
కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (sachin tendulkar) పేరు మీద ఉంది. సచిన్ 664 మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత భారత ఆటగాళ్ల పరంగా చూస్తే మహేంద్ర సింగ్ ధోని(ms dhoni) 538 మ్యాచ్‌లు, రాహుల్ ద్రావిడ్(rahul dravid) 509 మ్యాచ్‌లు ఆడారు. ఇక భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ఈ నెల 20 నుంచి ట్రినిడాడ్ వేదికగా ప్రారంభంకానుంది. ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న రోహిత్ సేన.. రెండో టెస్ట్ మ్యాచ్‌ను గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.
Updated Date - 2023-07-15T18:27:31+05:30 IST