ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India vs Australia 1st Test: ముగిసిన తొలిరోజు ఆట.. క్రీజులో రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్

ABN, First Publish Date - 2023-02-09T17:37:27+05:30

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (India Vs Austrlia) తొలి టెస్ట్ (1st test) మొదటి రోజు ఆట ముగిసింది. పర్యాటక జట్టు 177 పరుగులకే కుప్పకూలిన నాగ్‌పూర్ పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ శుభారంభాన్ని అందుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగ్‌పూర్: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా (India Vs Austrlia) తొలి టెస్ట్ (1st test) మొదటి రోజు ఆట ముగిసింది. పర్యాటక జట్టు 177 పరుగులకే కుప్పకూలిన నాగ్‌పూర్ పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ శుభారంభాన్ని అందుకున్నారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 1 వికెట్ నష్టానికి 77 పరుగులుగా ఉంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కెప్టెన్ రోహిత్ శర్మ 56 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు. ఇక వ్యక్తిగత స్కోరు 20 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. టీ ముర్ఫీ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత నైట్‌వాచ్‌గా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. కాగా భారత జట్టు ఇంకో 100 పరుగులు చేస్తే ఆసిస్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 177 పరుగులను అధిగమిస్తుంది.

తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన ఆస్ట్రేలియా..

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా (Jadeja) దెబ్బకు ఆస్ట్రేలియా లైనప్(Australia Cricket Team) కుప్పకూలింది. లబుషేన్‌ (49), స్మిత్ (37), రెన్‌షా(0), పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌(31), టాడ్ ముర్ఫీ (0) వికెట్లను పడగొట్టి జడేజా ఆసీస్ బ్యాటింగ్ నడ్డి విరిచాడు. కమ్ బ్యాక్ మ్యాచ్‌లో ఈ ఆల్‌రౌండర్ అదరగొట్టాడు. 5 వికెట్లతో రాణించి సత్తా చాటాడు.

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 22 ఓవర్లు బౌలింగ్ చేసి 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్ల తీశాడు. జడేజాతో పాటు టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ కూడా రాణించాడు. 3 వికెట్లతో ఆసీస్ బ్యాటింగ్‌ను దెబ్బకొట్టడంలో తన వంతు పాత్ర పోషించాడు. తన కెరీర్‌లో కూడా మరో అరుదైన రికార్డ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ ఫార్మాట్‌లో 450 వికెట్లు తీసిన మైలురాయిని చేరుకున్నాడు. ఇక పేసర్లు షమీ, సిరాజ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

నాగ్‌పూర్ పిచ్ స్పిన్‌ ఫ్రెండ్లీ వికెట్‌ కావడంతో.. బంతి అనూహ్యంగా టర్న్‌ అయింది. టీమిండియా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసేందుకు సహకరించింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లూ స్పిన్నర్లకు తుది జట్టులో పెద్దపీట వేశాయి. ఆతిథ్య జట్టును స్పిన్‌తో దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో ఏకంగా నలుగురు స్పిన్నర్లను టూర్‌కు ఎంపిక చేసింది. అంతేకాకుండా అశ్విన్‌ తరహా బౌలింగ్‌ శైలి కలిగిన మహీష్‌ పిథియాతో నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేయించింది. స్పిన్‌ విభాగానికి అగర్‌, లియాన్‌ నేతృత్వం వహించనున్నారు.

Updated Date - 2023-02-09T18:00:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising