ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India vs Australia 4th Test: గిల్ అర్ధ సెంచరీ పూర్తి..రోహిత్ శర్మ ఔట్..

ABN, First Publish Date - 2023-03-11T11:06:45+05:30

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య జరుగుతున్న నాల్గవ టెస్టు(Fourth Test)ఆట ప్రారంభం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అహ్మదాబాద్: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య జరుగుతున్న నాల్గవ టెస్టు(Fourth Test)ఆట ప్రారంభం అయ్యింది. ఓవర్ నైట్ స్కోర్ 36/0తో మూడో రోజు ఇన్నింగ్స్‎ను శుభమన్ గిల్(Shubman Gill), కెప్టెన్ రోహిత్(Captain Rohit) క్రీజులోకి వచ్చి మొదలు పెట్టారు. ఆస్ట్రేలియా చేసిన భారీ స్కోర్ కు టీమిండియా(Team India) ఓపెనర్లు ధీటుగానే సమాధానం ఇస్తున్నారు. ఓపెనర్లు ఇద్దరు కలిసి అర్ధశతక భాగస్వామ్యం (half-century partnership)నెలకొల్పారు. ఇదే క్రమంలో గిల్, రోహిత్ నిలకడగా ఆడుతున్న స్కోర్‎ను పరుగులు పెట్టిస్తున్నారు. అనూహ్యంగా ఈ జోడీని ఆసీస్ బౌలర్ కునెమన్ విడదీశాడు. కునెమన్(Kuneman) బౌలింగ్‎లో రోహిత్ శర్మ(35) భారీ షాట్ ఆడే ప్రయత్నంలో లబుషేన్‎కి(Labushene) క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‎లో తొలి వికెట్‎ను 74 పరుగుల వద్ద కొల్పోయింది. ఓపెనర్‎గా వచ్చిన మరో బ్యాటర్ శుభమన్‎గిల్ 93 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‎తో 51 రన్స్ చేసి.. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్ (51), పుజారా (13) కొనసాగుతున్నారు. భారత్ స్కోర్ 30 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 101 రన్స్ చేసింది.

Updated Date - 2023-03-11T11:06:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising