IPL2023: కొన్ని గంటల్లోనే ఐపీఎల్ తొలి మ్యాచ్.. ఇంతలోనే సడన్‌గా ఇలా అయిందేంటి..!
ABN, First Publish Date - 2023-03-31T13:15:33+05:30
క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) (IPL2023) 16వ సీజన్‌కు అంతా సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్..
క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) (IPL2023) 16వ సీజన్‌కు అంతా సిద్ధమైంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్-చెన్నై సూపర్ కింగ్స్ (GTvsCSK) మధ్య నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్ ద్వారా ఈ ధనాధన్ పోరు ఆరంభం కానుంది.
కానీ.. ఇంతలోనే తాజాగా జరిగిన ఒక పరిణామం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. తొలి మ్యాచ్‌కు వేదిక అయిన గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో (Ahmedabad) ఇవాళ ఉదయం నుంచి (మార్చి 31) వాతావరణం మేఘావృతమైంది. అహ్మదాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం కూడా వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిశాయి.
ఇది కూడా చదవండి: IPL GT vs CSK : ఎవరిదో శుభారంభం?
గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) మ్యాచ్‌కు వరుణుడు అడ్డు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేగానీ జరిగితే ఈ ఐపీఎల్ సీజన్ ఆరంభ మ్యాచ్ అభాసుపాలు కాక తప్పదు. కొంతలో కొంత శుభవార్త ఏంటంటే.. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌లో కురిసిన అకాల వర్షం గురువారం తర్వాత ఉండకపోవచ్చని తెలిపింది.
అయితే.. రానున్న 24 గంటల్లో అహ్మదాబాద్ ఉష్ణోగ్రతల్లో మాత్రం పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని, రెండుమూడు డిగ్రీల సెల్సీయస్ పెరగొచ్చని మాత్రం భారత వాతావరణ శాఖ తెలిపింది. AccuWeather.com అనే వాతావరణ అప్‌డేట్స్ ఇచ్చే వెబ్‌సైట్ కూడా మ్యాచ్ డేన వర్షం కురిసే సూచనలు ఏవీ లేవని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: ఐపీఎల్-16 ఆరంభోత్సవంలో తారల సందడి
అహ్మదాబాద్‌లో రోజూ మాదిరిగా ఎండ కనిపించకపోవడంతో అభిమానులు కొంత ఆందోళనగానే ఉన్నారు. అయితే.. మ్యాచ్ మొదలయ్యే సమయానికి వాతావరణం పొడిగా ఉండొచ్చని, ఉష్ణోగ్రత కూడా అహ్మదాబాద్‌లో 26 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉండొచ్చని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: IPL 2023: ఐపీఎల్ లైవ్‌ను ఉచితంగా ఇలా చూసేయండి!
ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు తొలి మ్యాచ్ జరగనుండగా.. అంతకు ముందు ఆరు గంటల నుంచి గ్రాండ్‌గా ఓపెనింగ్ సెర్మనీని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆరంభోత్సవంలో సినీ తారలు రష్మిక మందాన, తమన్నా భాటియా, సింగర్ అర్జిత్ సింగ్ తమ ఆటపాటలతో అలరిస్తారు. కత్రీనా కైఫ్, టైగర్ ష్రాఫ్ కూడా పాల్గొంటారని సమాచారం. ఈ ఆరంభ వేడుకలు స్టార్‌స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
Updated Date - 2023-03-31T13:29:02+05:30 IST