ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Prithvi Shaw: ఇక టీమిండియాకు ఎంపిక చేయాల్సిందే.. 28 ఫోర్లు, 11 సిక్సులు.. డబుల్ సెంచరీతో పృథ్వీ షా విశ్వరూపం!

ABN, First Publish Date - 2023-08-09T20:56:54+05:30

ఇంగ్లండ్‌లో జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్ 2023లో టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా విశ్వరూపం చూపించింది. హాఫ్ సెంచరీ కాదు, సెంచరీ కాదు ఏకంగా డబుల్ సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో టోర్నీ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు.

ఇంగ్లండ్‌లో జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్ 2023లో టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా విశ్వరూపం చూపించింది. హాఫ్ సెంచరీ కాదు, సెంచరీ కాదు ఏకంగా డబుల్ సెంచరీ కొట్టి చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో టోర్నీ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. గత సీజన్‌లో డబుల్ సెంచరీ కొట్టి 206 పరుగుల చొప్పున సాధించిన రాబిన్సన్, ఓర్ రికార్డులను సైతం పృథ్వీషా బద్దలుకొట్టాడు. అలాగే రాయల్ లండన్ వన్డే టోర్నీలో డబుల్ సెంచరీ కొట్టిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో పృథ్వీషా 129 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. దీంతో టోర్నీ చరిత్రలోనే అత్యంత వేగంగా డబులు సెంచరీ కొట్టిన ఆటగాడిగా షా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా లిస్ట్ ఏ క్రికెట్‌లో షాకు ఇది రెండో డబుల్ సెంచరీ కావడం గమనార్హం.


రాయల్ లండన్ వన్డే కప్‌లో నేడు నార్తాంప్టన్‌షైర్‌, సోమర్‌సెట్‌ జట్లు తలపడ్డాయి. ఈ టోర్నీలో 23 ఏళ్ల భారత ఆటగాడు పృథ్వీ షా నార్తాంప్టన్‌షైర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో నార్తాంప్టన్‌షైర్‌ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్‌గా వచ్చిన పృథ్వీ షా ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన షా దాదాపుగా ప్రతి బంతిని ఫోర్ లేదా సిక్సు బాదుతూ బౌలర్లను ముప్పతిప్పలుపెట్టాడు. పృథ్వీషా విధ్వంసం ధాటికి నార్తాంప్టన్‌షైర్‌ స్కోర్ బోర్డు ఎక్స్‌ప్రెస్ వేగంతో పరుగులు పెట్టింది. టీ20 స్టైల్‌లో విధ్వంసం సృష్టించిన పృథ్వీ షా 129 బంతుల్లోనే డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత చెలరేగిన పృథ్వీ షా మొత్తంగా 153 బంతులు ఎదుర్కొని 28 ఫోర్లు, 11 సిక్సులతో ఏకంగా 244 పరుగులు బాదేశాడు. షా స్ట్రైక్ రేట్ ఏకంగా 159గా ఉండడం గమనార్హం. ఓపెనర్‌గా వచ్చిన పృథ్వీ షా ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఔటయ్యాడు. షా విధ్వంసంతో నార్తాంప్టన్‌షైర్‌ స్కోర్ ఏకంగా 400 దాటింది. ఈ క్రమంలో పృథ్వీ షా ఇతర బ్యాటర్లతో కలిసి మొదటి వికెట్ 63, రెండో వికెట్‌కు 112, మూడో వికెట్‌కు 194 పరుగుల భారీ భాగస్వామ్యాలను నెలకొల్పాడు. మొత్తంగా పృథ్వీ షా అండతో నార్తాంప్టన్‌షైర్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగుల కొండంత స్కోర్ సాధించింది.

కాగా ఈ టోర్నీ మొదటి రెండు మ్యాచ్‌ల్లో పృథ్వీ షా విఫలమ్యాడు. మొదటి మ్యాచ్‌లో 34, రెండో మ్యాచ్‌లో 26 పరుగులు మాత్రమే చేశాడు. కాగా పృథ్వీ షాకు కొంతకాలంగా భారత జట్టులో చోటు దక్కని సంగతి తెలిసిందే. దీంతో తీవ్ర నిరాశలో పలుమార్లు సెలెక్టర్లపై పరోక్షంగా విమర్శలు కూడా చేశాడు. కానీ తాజా విధ్వంసంతో పృథ్వీషాకు త్వరలోనే భారత జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అభిమానులైతే షాను ఇక టీమిండియాకు ఎంపిక చేయాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. కాగా పృథ్వీ షా 2018లోనే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్ర టెస్టులోనే సెంచరీ కూడా కొట్టాడు. 2020లో వన్డేల్లో, 2021లో టీ20ల్లో కూడా అరంగేట్రం చేశాడు. కానీ ఆ తర్వాత ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు.

Updated Date - 2023-08-09T21:01:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising