IND vs WI 2nd Test: నిప్పులు కక్కిన సిరాజ్.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు భారీ అధిక్యం
ABN, First Publish Date - 2023-07-23T20:31:42+05:30
స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్(5/60) నిప్పులు కక్కే బంతులతో చెలరేగడంతో ఓవర్ నైట్ స్కోర్‌కు మరో 26 పరుగులు మాత్రమే జోడించి వెస్టిండీస్ ఆలౌటైంది. 229/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన విండీస్ మహ్మద్ సిరాజ్ దెబ్బకు విలవిలలాడింది.
ట్రినిడాడ్: స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్(5/60) నిప్పులు కక్కే బంతులతో విరుచుకుపడడంతో ఓవర్ నైట్ స్కోర్‌కు మరో 26 పరుగులు మాత్రమే జోడించి వెస్టిండీస్ ఆలౌటైంది. 229/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన విండీస్ మహ్మద్ సిరాజ్ దెబ్బకు విలవిలలాడింది. మ్యాచ్ ప్రారంభ ఓవర్‌లోనే ముకేష్ కుమార్ విండీస్‌ను దెబ్బతీశాడు. అలిక్ అథానాజ్(35) నాలుగో రోజు ఒక పరుగు కూడా చేయకుండానే లెగ్‌బైస్‌లో ఔట్ అయ్యాడు. ఇక మిగతా పని సిరాజ్ చూసుకున్నాడు. ఆ తర్వాతి ఓవర్‌లోనే మరో ఓవర్ నైట్ బ్యాటర్ హోల్డర్(15)ను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కూడా వరుస ఓవర్లలో వికెట్లు తీసిన సిరాజ్.. అల్జారీ జోసెఫ్(4), రోచ్(4), గాబ్రియేల్‌ను ఔట్ చేశాడు. గాబ్రియేల్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు.
దీంతో 5 వికెట్లు చేతిలో ఉన్నప్పటికీ నాలుగో రోజు ఆటలో 7 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకే ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 183 పరుగుల భారీ అధిక్యం లభించింది. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 5 వికెట్లతో చెలరేగాడు. ముఖేష్ కుమార్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు, అశ్విన్ ఒక వికెట్ తీశారు. కాగా మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 438 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ(121) సెంచరీతో చెలరేగగా.. రోహిత్ శర్మ(80), రవీంద్ర జడేజా(61), యశస్వి జైస్వాల్(57), అశ్విన్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో రోచ్, వారికన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. హోల్డర్ 2, గాబ్రియేల్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తోంది.
Updated Date - 2023-07-23T20:37:03+05:30 IST