ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: టీమిండియా క్రికెటర్లతో ఫోటోలకు పోజులిచ్చిన మిస్ వరల్డ్ బ్యూటీ

ABN, First Publish Date - 2023-07-23T17:23:22+05:30

ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు అతిథ్య జట్టుతో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ క్రమంలో భారత యువ ఆటగాళ్లను శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌ను మిస్ వరల్డ్ ట్రినిడాడ్ & టొబాగో ఆచే అబ్రహామ్స్ కలుసుకుంది. మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌ను కలుసుకున్న ఆమె వారితో ప్రత్యేకంగా ముచ్చటించింది.

ట్రినిడాడ్: ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు అతిథ్య జట్టుతో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ క్రమంలో భారత యువ ఆటగాళ్లను శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌ను మిస్ వరల్డ్ ట్రినిడాడ్ & టొబాగో ఆచే అబ్రహామ్స్ కలుసుకుంది. మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్‌ను కలుసుకున్న ఆమె వారితో ప్రత్యేకంగా ముచ్చటించింది. అనంతరం వారితో కలిసి ఫోటోలను దిగింది. భారత ఆటగాళ్లతో దిగిన ఫోటోలను ఆచే అబ్రహామ్స్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడం గమనార్హం. ‘‘టీమిండియాలోని గొప్ప గొప్ప ఆటగాళ్లను కలవడం సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం తర్వాత అంటే వచ్చే ఏడాది నేను మొదటి సారి భారత్‌కు వెళ్లబోతున్నాను. దానికి సంబంధించిన ఉత్సాహాన్ని నేను భారత ఆటగాళ్లతో పంచుకున్నాను.’’ అని రాసుకొచ్చింది. ఆచే అబ్రహామ్స్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలాగే దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.


ఇక ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి అతిథ్య వెస్టిండీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. క్రీజులో అలిక్ అథానాజ్(37), జేసన్ హోల్డర్ (11) ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 2, ముఖేష్ కుమార్, అశ్విన్, సిరాజ్ తలో వికెట్ తీశారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 438 పరుగులు చేసింది. కాగా విండీస్ జట్టు భారత్ కన్నా ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది. మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట కీలకంగా మారింది.

Updated Date - 2023-07-23T17:23:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising