ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mohammed Shami: టీమిండియా క్రికెటర్ షమీ మనసు బంగారం.. రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తి..

ABN, First Publish Date - 2023-11-26T11:52:33+05:30

టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ తన మంచి మనసును చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి ప్రాణాలు రక్షించి ప్రాణ దాతగా మారాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది.

టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ తన మంచి మనసును చాటుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తి ప్రాణాలు రక్షించి ప్రాణ దాతగా మారాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నైనిటాల్ రోడ్డు మార్గంలో ఓ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకుపోయింది. ఆ వెనుక కారులోనే షమీ ఉన్నాడు. ఇది గమనించిన షమీ వెంటనే స్పందించాడు. ఇతర వాహనదారులతో కలిసి బాధితుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. కారు ప్రమాదంలో ఆ వ్యక్తికి గాయాలయ్యాయి. శనివారం రాత్రి నైనిటాల్‌ రోడ్డు మార్గంలో ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను షమీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఒకరిని రక్షించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని ఆ వీడియోలో టెక్ట్స్ రాశాడు.


"అతను చాలా అదృష్టవంతుడు. దేవుడు అతనికి రెండో జీవితాన్ని ఇచ్చాడు. అతని కారు నైనిటాల్ సమీపంలోని కొండ రహదారి నుంచి నా కారుకు ఎదురుగా పడిపోయింది. మేము అతనిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చాం." అని తెలిపాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన అభిమానులు షమీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మా షమీ మనసు బంగారం అంటూ రాసుకొస్తున్నారు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన షమీ తనకు ట్రావెలింగ్ అంటే ఇష్టమని చెప్పాడు. ‘‘నాకు ట్రావెలింగ్ చేయడం, చేపలు పట్టడం అంటే ఇష్టం. డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. బైక్‌లు, కార్లు నడపడానికి ఇష్టపడతాను. కానీ టీమిండియా తరఫున ఆడిన తర్వాత బైక్‌లు నడపడం మానేశాను. అలాంటి సమయంలో గాయపడితే చాలా ఇబ్బంది అవుతుంది. హైవేలపైనా, గ్రామాల్లోనూ బైక్‌లపై విపరీతంగా తిరిగేవాడిని. బైక్‌లు, కార్లే కాకుండా ట్రాక్టర్, బస్, ట్రక్కులను కూడా నడిపాను. నా స్నేహితుడికి ట్రక్ ఉండేది. నా చిన్నతనంలో దానిని ఓ మైదానంలో నడిపేవాళ్లం. ఒకసారి మా ట్రాక్టర్‌తో చెరువులోకి దూసుకెళ్లాను. అప్పుడు మా నాన్న చీవాట్లు పెట్టాడు.’’ అని షమీ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కాగా ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌లో షమీ దుమ్ములేపాడు. 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు తీశాడు. తద్వారా ఈ టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

Updated Date - 2023-11-26T11:52:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising