ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bumrah-Neeraj: పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రాకు సలహా ఇచ్చిన గోల్డెన్ భాయ్ నీరజ్ చోప్రా.. అదేంటంటే..?

ABN, First Publish Date - 2023-12-05T11:23:44+05:30

Jasprit Bumrah: గాయం కారణంగా 11 నెలలపాటు టీమిండియాకు దూరంగా ఉన్న పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ద్వారా పునరాగమనం చేసిన బుమ్రా సత్తా చాటుతున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లోనూ బుమ్రా చెలరేగాడు.

గాయం కారణంగా 11 నెలలపాటు టీమిండియాకు దూరంగా ఉన్న పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్ ద్వారా పునరాగమనం చేసిన బుమ్రా సత్తా చాటుతున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, ఆసియా కప్, వన్డే ప్రపంచకప్‌లోనూ బుమ్రా చెలరేగాడు. సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అయితే అదరగొట్టాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో తక్కువ ఎకానమీతో కీలక వికెట్లు తీశాడు. వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆకట్టుకునే బుమ్రా 140 కిలో మీటర్ల వేగానికి తగ్గకుండా బౌలింగ్ చేస్తుంటాడు. తక్కువ రన్ అప్‌తో వేగంగా బౌలింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాడు. దీంతో చాలా మందికి బుమ్రా ఫెవరేట్ బౌలర్‌గా ఉన్నాడు. భారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా కూడా బుమ్రా బౌలింగ్‌కు అభిమాని. ఈ క్రమంలో బుమ్రా తన బౌలింగ్ స్పీడ్‌ను మరింత పెంచుకోవడానికి గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా ఓ సలహా కూడా ఇచ్చాడు. బుమ్రా తన రన్ అప్‌ను పెంచుకుంటే బౌలింగ్ స్పీడ్ పెరుగుతుందని చెప్పుకొచ్చాడు.


ఓ జాతీయ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రా మాట్లాడుతూ ‘‘బుమ్రా అంటే నాకు చాలా ఇష్టం. అతని బౌలింగ్ యాక్షన్ ప్రత్యేకమైనది. బుమ్రా తన బౌలింగ్ వేగాన్ని మరింత పెంచుకునేందుకు రన్ అప్‌ను పెంచుకోవాలని నేను భావిస్తున్నాను. బౌలర్ల తమ రన్ అప్‌ను కొంచెం వెనుక నుంచి ప్రారంభిస్తే వారి వేగాన్ని పెంచుకోవచ్చని జావెలిన్ త్రోయర్‌గా నేను తరచుగా చర్చిస్తుంటాను’’ అని చెప్పాడు. కాగా పాకిస్థాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్‌తో సహా పలువురు మాజీ ఆటగాళ్లు కూడా ఇదే చెప్పారు. బుమ్రా తన రన్ అప్‌ను కాస్త వెనుక నుంచి తీసుకోవడం ద్వారా వేగం పెరడంతోపాటు గాయాలు కూడా కాకుండా రక్షించుకోవచ్చని అన్నారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్‌ను మైదానంలో ప్రత్యక్షంగా చూసిన స్టార్లలో నీరజ్ చోప్రా ఒకడు. దీంతో వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌పై కూడా చోప్రా మాట్లాడాడు. ‘‘మ్యాచ్ ప్రారంభం నుంచే ఆస్ట్రేలియా ఆటగాళ్లు మానసికంగా పైచేయి సాధించారు. బౌలింగ్‌లో మానసికంగా వాళ్లు చాలా దృఢంగా కనిపించారు. వారు తమ ఆటపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. చివరికి భారత జట్టుపై విజయం సాధించారు’’ అని అన్నాడు. ఇక ప్రపంచకప్ ముగిసిన తర్వాత బుమ్రాకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. డిసెంబర్ 26 నుంచి సౌతాఫ్రికాతో ప్రారంభం కాబోయే టెస్టు సిరీస్ ద్వారానే బుమ్రా మళ్లీ జట్టులోకి రానున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-05T14:27:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising