ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup: భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పు?.. మ్యాచ్ జరిగేది ఎప్పుడంటే..?

ABN, First Publish Date - 2023-07-26T15:24:12+05:30

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునున్నాయని సమాచారం. ఐసీసీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న మ్యాచ్ జరగడం కష్టమేనని పలు జాతీయ మీడియాలు చెబుతున్నాయి.

అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్‌‌లో భాగంగా భారత్, పాకిస్థాన్‌ల మ్యాచ్ అక్టోబర్ 15న జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గల నరేంద్రమోదీ స్టేడియం అతిథ్యం ఇవ్వనుంది. సాధారణంగా భారత్, పాక్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదొక క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు. కోట్లాది మంది అభిమానుల భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. ఓ సాధారణ మ్యాచ్ మాదిరిగా కాకుండా ఓ చిన్నపాటి యుద్ధంగా భావించేవారు అనేక మంది ఉన్నారు. మ్యాచ్ ఎక్కడ జరిగినా సరే అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతారు. దూర ప్రాంతాల నుంచి వెళ్లేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 15న జరిగే మ్యాచ్ కోసం అహ్మదాబాద్ వెళ్లేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వెళ్లే అభిమానులు ముందుగానే విమాన టికెట్లు, హోటల్ గదులు బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్‌లో మ్యాచ్ జరిగే రోజు విమాన టికెట్ల ధరలు, హోటల్ గదుల ధరలను నిర్వహకులు విపరీతంగా పెంచేశారు. అయితే ప్రస్తుతం వారందరికీ షాక్ తగిలే అవకాశాలున్నాయి. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకునున్నాయని సమాచారం. ఐసీసీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న మ్యాచ్ జరగడం కష్టమేనని పలు జాతీయ మీడియాలు చెబుతున్నాయి.


మ్యాచ్ తేదీని మార్చడానికి కారణాలు ఏంటంటే.. అక్టోబర్ 15 నుంచి గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా హడావిడి ఎక్కువగా ఉంటుంది. అదే రోజు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఉంటే భద్రతాపరంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలుంటాయి. ఈ క్రమంలోనే మ్యాచ్ తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐకి సూచించినట్లు ఓ జాతీయ మీడియా పేర్కొంది. అయితే దీనిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాగా ప్రపంచకప్‌ మ్యాచ్‌లకు అతిథ్యం ఇచ్చే రాష్ట్ర సంఘాలతో బీసీసీఐ కార్యదర్శి జైషా ఈ నెల 27న ఢిల్లీలో సమావేశం కానునట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలోనే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు గురించి చర్చించే అవకాశాలున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌కు ఒక రోజు ముందుగా అంటే అక్టోబర్ 14న భారత్, పాక్ మ్యాచ్‌ను నిర్వహించే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే వరకు వేచి చూడాల్సిందే. అలాగే మ్యాచ్ తేదీలో మార్పులు చోటుచేసుకుంటే ముందుగానే విమాన టికెట్లు, హోటల్ గదులు బుక్ చేసుకున్నవారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు.

ఇక భారత్ వేదికగా జరగనునున్న వన్డే ప్రపంచకప్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 మధ్య జరగనుంది. ఈ టోర్నీ మొత్తం 10 వేదికలలో జరగనుంది. అహ్మదాబాద్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌తో కలిపి 4 మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీ ఆరంభ మ్యాచైనా న్యూజిలాండ్ vs ఇంగ్లండ్, భారత్ vs పాకిస్థాన్, ఇంగ్లండ్ vs ఆస్ట్రేలియా మ్యాచ్‌లతోపాటు ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ముంబై, కోల్‌కతాలో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Updated Date - 2023-07-26T22:16:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising