ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ODI World Cup: ప్రపంచకప్‌నకు ముందు ఈడెన్ గార్డెన్స్‌ క్రికెట్ స్టేడియంలో అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2023-08-10T15:21:16+05:30

ప్రపంచకప్‌నకు ముందు కోల్‌కతాలోని ప్రముఖ క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్‌‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచకప్ నేపథ్యంలో స్టేడియం పునరుద్ధరణ పనులు చేపడుతుండగా బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది.

కోల్‌కతా: ప్రపంచకప్‌నకు ముందు కోల్‌కతాలోని ప్రముఖ క్రికెట్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్‌‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచకప్ నేపథ్యంలో స్టేడియం పునరుద్ధరణ పనులు చేపడుతుండగా బుధవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూముల్లో నుంచి మంటలు వచ్చాయి. దీంతో స్టేడియం నిర్వహకులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. డ్రెస్సింగ్ రూమ్ ఫాల్స్ సీలింగ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సాధారణంగా క్రికెటర్లు తమ సామగ్రిని భద్రపరచుకోవడానికి డ్రెస్సింగ్ రూంలను వాడుతుంటారు. ఈ ఘటనలో స్వప్ప నష్టంతో బయటపడ్డామని స్టేడియం సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆటగాళ్లకు చెందిన కొంత సామగ్రి కాలిపోయినట్లు తెలుస్తోంది.


అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేబబ్రత దాస్ మైదానానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. ఘటనపై దర్యాప్తు చేస్తామని, సిబ్బంది నిర్లక్ష్యం కనుక ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం. మరోవైపు ఇక్కడ ఆటగాళ్లకోసం మరో కొత్త డ్రెస్సింగ్ రూమ్‌ను కూడా నిర్మిస్తున్నారు. అందుకు సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. కాగా ఈ మైదానంలో ప్రపంచకప్‌లోని 5 మ్యాచ్‌లు జరగనున్నాయి. ముఖ్యంగా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఇక్కడే జరగనుంది. అలాగే దక్షిణాఫ్రికాతో భారత జట్టు ఆడే మ్యాచ్ కూడా ఇక్కడే జరగనుంది. కాగా అక్టోబర్ 5 నుంచి ప్రపంచకప్ ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరిగే వేదికలను ఐసీసీ ఇటీవల పరిశీలించింది. అందులో భాగంగానే ఈడెన్ గార్డెన్స్ స్టేడియాన్ని కూడా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. తాజా ఘటన నేపథ్యంలో సెప్టెంబర్‌లో ఐసీసీ మరోసారి ఈ స్టేడియాన్ని పరిశీలించే అవకాశాలున్నాయి. అలాగే అగ్నిప్రమాదం నేపథ్యంలో స్టేడియంలోని ఫైర్ సేఫ్టీపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా మ్యాచ్‌లు జరగాలంటే ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం తప్పనిసరి.

Updated Date - 2023-08-10T15:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising