కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Prithvi Shaw: టోర్నీ నుంచి డబుల్ సెంచరీ హిరో పృథ్వీ షా ఔట్!

ABN, First Publish Date - 2023-08-16T20:45:25+05:30

ఇంగ్లండ్‌లో జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్ 2023లో అదరగొడుతున్న టీమండియా యువ బ్యాటర్ పృథ్వీషా టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. మోకాలి గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు.

Prithvi Shaw: టోర్నీ నుంచి డబుల్ సెంచరీ హిరో పృథ్వీ షా ఔట్!

ఇంగ్లండ్‌లో జరుగుతున్న రాయల్ లండన్ వన్డే కప్ 2023లో అదరగొడుతున్న టీమండియా యువ బ్యాటర్ పృథ్వీషా టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. మోకాలి గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని పృథ్వీ షా ప్రాతినిధ్యం వహిస్తున్న నార్తంప్టన్‌షైర్ జట్టు అధికారికంగా ప్రకటించింది. డర్హమ్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా షా గాయపడ్డాడని, స్కానింగ్ రిపోర్టుల్లో గాయం ఊహించినదాని కంటే పెద్దదని తేలిందని నార్తంప్టన్ షైర్ తెలిపింది. దీంతో తదుపరి మ్యాచ్‌లకు షా దూరంగా ఉండనున్నట్లు తెలిపింది. షా తక్కువ కాలంలోనే తమ జట్టులో కీలక ఆటగాడిగా మారాడని, అతను జట్టును వీడడం బాధాకరం అని నార్తంప్టన్‌షైర్ కోచ్ జాన్ సాడ్లర్ ట్వీట్ చేశాడు. పృథ్వీ షా త్వరగా కోలుకుని మరిన్ని పరుగులు సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.


కాగా ఈ టోర్నీలో అద్భుతంగా ఆడిన పృథ్వీషా నార్తంప్టన్‌షైర్ తరఫున ఓ డబుల్ సెంచరీ, సెంచరీతో దుమ్ములేపాడు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో కలిపి 60 పరుగులే చేశాడు. కానీ ఆగష్టు 9న సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 ఏళ్ల పృథ్వీ షా విశ్వరూపం చూపించాడు. ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. 28 ఫోర్లు, 11 సిక్సులతో 153 బంతుల్లోనే 244 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత ఆగష్టు 13న డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ చెలరేగాడు. 15 ఫోర్లు, 7 సిక్సులతో 76 బంతుల్లోనే 125 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లోనే 429 పరుగులు చేసిన పృథ్వీ షా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్నాడు.

Updated Date - 2023-08-16T20:47:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising